బిగ్ బాస్ సీజన్ వన్ టైటిల్ విన్నర్ శివ బాలాజీ. మొట్టమొదటిసారి తెలుగు లో ప్రసారం అయిన సందర్భంలో చాలామంది ప్రేక్షకులు బిగ్ బాస్ ని ఆదరించటం జరిగింది. పైగా జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అదరగొట్టేసారు. హౌస్ లో ఉన్న వారిని నవ్విస్తూ ఏడిపించాలని టైం లో ఏడిపిస్తూ వార్నింగ్ ఇవ్వాల్సిన టైం లో వార్నింగ్ ఇస్తూ… వెండితెరపై ఎలాగా అదరగొట్టే వాడు అదేరీతిలో యాంకరింగ్ అదిరిపోయే రేంజ్ లో చేశాడు ఎన్టీఆర్.
కాగా ఆ సమయంలో హౌస్ లో చాలా మెచ్యూర్ మైండ్ తో గేమ్ ఆడే వాడు శివబాలాజీ. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అనే రీతిలో శివబాలాజీ హౌస్ లో రాణించడం జరిగింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న సీజన్ ఫోర్ లో హౌస్ లో ఒక ఇంటి సభ్యుడిని చూసి ఇతనెవరో నాలాగే ఉన్నాడు అంటూ శివబాలాజీ కామెంట్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
పూర్తి విషయంలోకి వెళితే శివబాలాజీ అప్పట్లో హౌస్ లో ఓ రేంజ్ లో ఆవేశపడే వారు. ప్రతి దానికి చాలా సీరియస్ గా మిగతా ఇంటి సభ్యులు భయపడేలా వ్యవహరించేవారు. ఇప్పుడు ఇదే రీతిలో హౌస్ లో సోహైల్ వ్యవహరించడంతో తన ఇంట్లో మా టీవీ బిగ్బాస్ చూస్తున్న శివ బాలాజీ … సొహైల్ నీ చూసి వీడు ఎవడో నాకు తమ్ముడు లాగా ఉన్నాడు అని అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో.. న్యూస్ వినబడుతోంది.