స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠ పురంలో’ చిత్రంతో బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత మంచి ఊపు మీద ఉన్నాడు. సుకుమార్ తో ‘పుష్ప’ అనే ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న బన్నీ వరుసగా క్రేజీ ప్రాజెక్టులను ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు.
ప్రస్తుతం సుకుమార్ సినిమా తర్వాత వెంటనే బన్నీ మరో స్టార్ డైరెక్టర్ ను లైన్ లో పెట్టేశాడు. అతనే మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ తీస్తున్న కొరటాల శివ. ‘పుష్ప’ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే కొరటాల ప్రాజెక్టును పట్టాలెక్కించేయనున్నాడు. ఇక ఈ సినిమాని కూడా ‘పుష్ప’ లాగానే పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులతో బన్నీ భారతదేశమంతా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాడు.
అయితే బన్నీ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరొక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. విషయం ఏమిటంటే… బాలీవుడ్ మార్కెట్ నేపథ్యంలో ఉండేలా ఈ కథను సిద్ధం చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాలో క్యాస్టింగ్ కూడా అదే రకంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక హీరోయిన్ విషయానికి కూడా ఓ క్లారిటీకి వచ్చారట… బాలీవుడ్ హీరోయిన్ ఉంటేనే సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని అందుకోసం ఆలియా భట్, కైరా అద్వాని తో పాటు మరో ఒకరిద్దరు స్టార్ హీరోయిన్ లలో ఎవరో ఒకరిని ఎంపిక చేసి ఇప్పుడే అడ్వాన్సులు ఇచ్చేసి బుక్ చేసుకోవాలని చూస్తున్నారు కూడా.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి కచ్చితంగా బాలీవుడ్ హీరోయిన్ ని మాత్రమే తీసుకోవాలని బన్నీ కూడా స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయాడట.