Sehari Teaser: హర్ష్ కాను మిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం “సెహరి”.. సంగీత దర్శకుడు కోటి ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు.. వర్గో పిక్చర్స్ బ్యానర్ పై అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు..

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.. అప్పటినుంచి ఈ సినిమాపై ఆసక్తి పెంచుతుంది.. టీజర్ అనౌన్స్మెంట్ కూడా ప్రత్యేక వీడియో ను విడుదల చేసింది. అందులో అందరూ హీరో ను ‘బాలయ్య మిమ్మల్ని టచ్ చేశాడు కదూ.. మీరు వర్జిన్ స్టార్..’ అంటూ ఆగమాగం చేస్తున్నారు.. ఈ స్పెషల్ వీడియో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా విడుదలైన టీజర్ కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది.. ఈ వర్జిన్ స్టార్ టీజర్ మీరు ఓ సారి వీక్షించండి..