Selfie: సెల్ఫీ దిగుతున్నారా..!? అయితే ఈ వ్యాధిని గుర్తించండి…!!

Share

Selfie: సెల్ఫీ.. ఈ రోజుల్లో ఈ పదం తెలియని వారు ఉండరనడం లో సందేహం లేదు.. ఉదయం లేచినప్పటినుంచి రాత్రి నిద్ర పోయేవరకు రకరకాల సందర్భాలలో సెల్ఫీలు దిగుతున్నారు.. రోజుకి కనీసం ఒక్క సెల్ఫీ కూడా దిగకుండా ఉండలేని వాళ్ళు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.. కొందరైతే సెల్ఫీల కోసం ప్రత్యేకమైన కెమెరా ఫీచర్ ఉండే ఫోన్లు కూడా కొనుగోలు చేస్తున్నారు.. సెల్ఫీ దిగి స్టేటస్ లు పెడుతున్నారు.. అదే సెల్ఫీ తో వ్యాధులను కూడా గుర్తించవచ్చని తాజా పరిశోధనల్లో తేలింది..!!

Selfie: Using Tool to identify the heart problems
Selfie: Using Tool to identify the heart problems

యూరోపియన్ హార్ట్ జనరల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. సెల్ఫీ నీ గుండె పనితీరు గుర్తించే ఒక టూల్ గా వినియోగించవచ్చని ఆ పరిశోధనలో తేల్చారు. గుండె పనితీరును సెల్ఫీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో స్క్రీన్ చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. Zhei Zhen చైనా లోని ప్రముఖ FUAI హాస్పటల్ వైస్ ప్రెసిడెంట్ ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్నారు.

Selfie: Using Tool to identify the heart problems
Selfie: Using Tool to identify the heart problems

మేము గుండె జబ్బులు ప్రమాదాన్ని అంచనా వేయడానికి లోతైన అధ్యయనం చేస్తున్నట్లు వారు తెలిపారు. తక్కువ ఖర్చు లోని అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు దీని అభివృద్ధికి అడుగులు వేస్తున్నట్లు వారు చెబుతున్నారు. అంతేకాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులను సులువుగా గుర్తించొచ్చు ఈ అధ్యయనం కోసం 5794 మంది రోగులను పరీక్షించినట్లుగా తెలియజేశారు. ఇటీవల కాలంలో గుండెజబ్బుల కారణంగా ఎక్కువమంది చనిపోతూన్నారు. ఈ అధ్యయనం విజయవంతమైతే గుండె జబ్బుల్ని ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.


Share

Related posts

దుబ్బాక నియోజకవర్గం ప్రజలకు బంపర్ ఆఫర్ హామీలు ఇస్తున్న హరీష్ రావు..!!

sekhar

బ్రేకింగ్ : ఈఎంఐ మారటోరియం పై సుప్రీంకోర్టు గుడ్ న్యూస్

Arun BRK

Mahesh Babu: రాజమౌళి- మహేష్ సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చిన నిర్మాత..!!

sekhar