Hema: మనసు మార్చుకున్న హేమ.. “మా” బరిలోకి ఎందుకు దిగుతున్నారంటే..!?

Share

Hema: సెప్టెంబర్ లో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ “మా” ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి.. “మా” అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే ప్రకాష్ రాజు, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా 4వ పోటీదారుగా హేమ కూడా బరిలోకి దిగనుంది.. ఏ పరిస్థితులలో తాను పోటీ పడుతున్నారో కూడా తెలిపింది..!!

senior actress Hema: in Maa president race
senior actress Hema: in Maa president race

Read More: Stand Up Rahul: “స్టాండ్ అప్ రాహుల్” లో ఛాలెంజింగ్ రోల్ లో వర్ష బొల్లమ్మ..!!

ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ.. మా లో గత కొన్ని సంవత్సరాలుగా మా ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలుగా పదవులు చేపట్టాను.. ఆ పదవులకు న్యాయం చేశాను. ఈసారి కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మా అసోసియేషన్ ఎన్నికలు వచ్చాయి. అయితే ఈసారి ట్రెజరీ పదవికి పోటీ చేయాలని అనుకున్నాను. ఇది ఎలక్షన్ కు ముందు ఆలోచన. కానీ ఇప్పుడు ఆ ఆలోచన మారింది. ఎలక్షన్ ని ప్రకటించగానే ప్రకాష్ రాజ్ గారు, మంచు విష్ణు బాబు, జీవిత గారు పోటీ చేస్తున్నారని తెలిసింది. పెద్దలు బరిలో దిగుతున్నారు అని తెలిశాక.. పెద్దల వివాదాల్లో మనం ఎందుకు చిక్కుకోవాలి.. పోటీ పడాలి.. అసలు పోటీ చేయకూడదని అనుకున్నాను. నిన్నటి ప్రకటన తరువాత సినీ ప్రముఖుల నుంచి ఒత్తిడి ఎదుర్కొన్నాను. నేను ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసినప్పుడు నా స్నేహితులు ముఖ్యంగా మహిళా సపోర్టర్స్ అంతా నన్ను మెజారిటీతో గెలిపించిన సినీప్రముఖుల ఫోన్ చేసి నువ్వు ఎందుకు పోటీ చేయకూడదు.. నువ్వు ఉంటే బాగుంటుంది. ఎవరైనా కష్టాలు చెప్పుకోవాలని అర్ధరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటావు. అందుకే నువ్వే కావాలని అడుగుతున్నారు. నన్ను పోటీ చేయమని నా వాళ్లంతా ఒత్తిడి చేస్తున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ సమయంలో నాకు అండగా నిలిచిన వారందరికోసం, నా వారి కోసం మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలని అనుకుంటున్నాను అని హేమ వివరించారు.


Share

Related posts

ఆ శక్తులపై కేంద్ర మంత్రుల ఆసక్తి..! విడ్డూరం ప్రకటనలు

somaraju sharma

ఆంధ్రప్రదేశ్‌లో కొలువుతీరిన హైకోర్టు

somaraju sharma

ఈ వైసీపీ ఎమ్మెల్యేల స్పీడ్ మామూలుగా లేదుగా!

Yandamuri