వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సొంత బయోపిక్ వస్తుందని సంచలనాత్మకంగా కొద్ది నిమిషాల క్రితం అనౌన్స్ చేశాడు. బొమ్మాకు మురళి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రాము’ అని పేరు పెట్టారు. రామ్ గోపాల్ వర్మే తన బయోపిక్ కు కథను రాసుకుంటున్నాడు. ఈ చిత్రానికి దొర సాయి తేజ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సంవత్సరం సెప్టెంబర్ నుండి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇక ఈ చిత్రం యొక్క టైటిల్ ‘రాము’ అని పెట్టారు. కింద ‘బయోపిక్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ’ అన్నది క్యాప్షన్. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రం మొత్తం మూడు భాగాలుగా ఉంటుందని రాము చెప్పాడు. ఒక్కో భాగం రెండు గంటల నిడివి ఉంటుందని. అలా మూడు భాగాలు మొత్తం కలిపి ఆరు గంటల పాటు తన జీవిత చరిత్రను ప్రేక్షకులు తెర మీద చూస్తారని వర్మ చెప్పారు.
వర్మ జీవితంలోని వేరు వేరు వయసుల్లో…. వేర్వేరు అంశాలను చూపెట్టబోతున్నాడు. మొదటి భాగం లో ఒక కొత్త యాక్టరు 20 ఏళ్ల వర్మగా నటించబోతున్నాడు. రెండవ పార్ట్‌లో మరొక యాక్టరు వర్మ క్యారెక్టర్ లో నటిస్తుంటే మూడవ పార్టీలో మాత్రం స్వయంగా ఆర్జీవీ నే తన పాత్ర పోషించబోతున్నాడు.
‘రాము’ మొదటి భాగం – రాము :
అతని కాలేజ్ లైఫ్ తో సహా.. ఫస్ట్ లవ్, విజయవాడలో గ్యాంగ్ ఫైట్స్…. ఇక అతను ఎలాగా నాగార్జునను మేనిప్యులేట్ చేసి ‘శివ’ సినిమా తీసింది అవన్నీ పొందుపరుస్తున్నారు
‘రాము’ రెండవ భాగం – అండర్ వరల్డ్ తో ప్రేమాయణం
అతని ముంబై లైఫ్ గురించి ఇందులో చెప్పబోతున్నారు. ముంబైలో అమ్మాయిలతో అతని సావాసం, గ్యాంగ్ స్తాఱ్ లు, అమితాబ్ బచ్చన్ తో అతనికున్న సంబంధాలు గురించి చూపిస్తారు.
‘రాము’ మూడవ భాగం – “RGV” — ది ఇంటెలిజెంట్ ఇడియట్
మూడవ పార్ట్ కి వచ్చేటప్పటికి రాము ‘ఇంటెలిజెంట్ ఇడియట్’ గా తీస్తారు. ఇందులో వర్మ ఫెయిల్యూర్స్, వివాదాలు, దేవుళ్ళ పట్ల, సెక్స్ పట్ల , సమాజం పట్ల నాకున్న విపరీత వైఖరుల గురించి చెప్పబోతున్నారు.
ఇక ఆర్జీవీ అభిమానులతో పాటుగా అతనిని ద్వేషించే వారికి కూడా ఈ సినిమా పండగ లాంటిదే అనుకోవచ్చు. అతను ఆ స్థాయి నుండి ఈ స్థాయి వరకు ఎలా వచ్చారు అన్న విషయాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. మొత్తానికి ఆల్ ది బెస్ట్ గోపాల్ వర్మ.