Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఎక్కువ నెగిటివిటీ ఎదుర్కొన్నది సిరి, షణ్ముఖ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడైతే హౌస్ నుండి అనారోగ్యం కారణంగా జెస్సీ ఎలిమినేట్ కావాల్సి వచ్చిందో.. అప్పటి నుండి వీరిద్దరి మధ్య రిలేషన్ ఎమోషనల్ గా బాగా దగ్గర అయిపోయారు. జెస్సీ ఉన్న సమయంలో… హౌస్ లో త్రిమూర్తులుగా.. పిలవబడగా.. ఆ తర్వాత జెస్సీ కి వేర్టి గా రావటం ఇంటి నుండి వెళ్ళి పోవడం జరిగింది.
దీంతో షణ్ముక్ సిరి… చాలా వరకు కలిసికట్టుగా గేమ్ ఆడే వాళ్ళు. ఎప్పుడైనా సిరి ఎలిమినేషన్ లోకి వస్తే వెంటనే షణ్ముక్ ఫ్యాన్స్ భారీ ఎత్తున ఓటు వేసి కాపాడే పరిస్థితి అప్పట్లో కనిపించేది. అయితే ఎమోషనల్ గా వీరిద్దరు ఎక్కువగా..హగ్ లు ఇచ్చుకోవడం… అదే సమయంలో ఫ్యామిలీ ఎపిసోడ్ లో సిరి వాళ్ళ తల్లి షణ్ముక్ తన కూతురికి ఎక్కువ కనెక్ట్ కావడం తనకి ఇష్టం లేదని అనడం షణ్ముఖ్ గేమ్ కి పెద్ద మైనస్ అయ్యింది.
అయినా కానీ వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా… బయట ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే సిరీతో కనెక్షన్ వల్లే షణ్ముక్ ఓడిపోయినట్లు అదేరీతిలో దీప్తి సునయన దూరమైనట్లు ఇటీవల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో ఇంస్టాగ్రామ్ లో షణ్ముక్.. సిరిని అన్ ఫాలో చేసి ఊహించని షాక్ ఇచ్చాడు. ఈ పరిణామంతో సిరి ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నట్లు టాక్. మరోపక్క సీరి మాత్రం షణ్ముక్ నీ ఫాలో అవుతూనే ఉంది. ప్రస్తుతం షణ్ముక్ మరో కొత్త వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఏజెంట్ ఆనంద్ అనే టైటిల్ తో… ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.