ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: యాంకర్ రవి ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ లో అదే నాకు తీపి.. చేదు జ్ఞాపకం అంటూ షణ్ముఖ్ వైరల్ కామెంట్స్..,!!

Share

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో రన్నర్ గా నిలిచిన షణ్ముక్.. హౌస్ నుండి బయటకు వచ్చాక బాగా నెగిటివిటీ ఎదుర్కోవడం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో కేవలం కొద్ది మందితో మాత్రమే ఉండటంతో పాటు స్టార్టింగ్ లో పెద్దగా గేమ్ ఆడకుండా ఉండటం అతనికి మైనస్ అయ్యింది. సోషల్ మీడియాలో తిరుగులేని ఫ్యాన్స్ ఉన్నాగాని షణ్ముక్ కి సైకిల్ రాకపోవడం పట్ల.. షణ్ముఖ ఫాలోవర్స్ ఎంతగానో బాధపడ్డారు.

ఇదిలా ఉంటే ఉగాది పండుగ సందర్భంగా యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానల్ లో… షణ్ముక్, యానీ మాస్టర్, సింగర్ శ్రీరామ్ లని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చాలా ఫన్నీగా జరిగిన ఇంటర్వ్యూలో సీజన్ ఫైవ్ బిగ్ బాస్ హౌస్ కి సంబంధించిన ప్రశ్నలు కూడా ఈ ముగ్గురిని యాంకర్ రవి తనదైన శైలిలో ప్రశ్నిస్తూ మరోపక్క కామెడీ పండించాడు. ఈ తరుణంలో బిగ్ బాస్ హౌస్ లో స్వీట్ మెమరీ ఇంకా చేదు జ్ఞాపకం ఏంటో తెలియజేయాలని షణ్ముఖ్ నీ రవి ప్రశ్నించాడు.

దానికి షణ్ముక్ సమాధానం చెబుతూ.. ముందుగా స్వీట్ మెమరీ అయితే మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో త్వరగా కనెక్ట్ అవ్వరు. బిగ్ బాస్ హౌస్ లో అంతగా ఉండదు. కానీ నాకు బిగ్ బాస్ హౌస్ నుండి డి నిన్ను అంటూ యాంకర్ రవి నీ.. శ్రీరామ్, మానస్, జెస్సీ, యాని మాస్టర్ వంటి మంచి మనుషులను లైఫ్ లో కలుసుకునే అనుభవాన్ని ఇచ్చినట్లు తెలిపాడు. ముఖ్యంగా తన ఫాలోవర్స్ బిగ్ బాస్ హౌస్ లో తన కోసం బయట ఫైట్ చేయడం మర్చిపోలేనిది. స్టార్టింగ్ లో చాలా సైలెంట్ గేమ్ ఆడాడు కానీ ముందు నుండి సరిగ్గా ఉంటే బాగుండేదని బయటకు వచ్చాక అనిపించింది.

ఇక చేదు జ్ఞాపకం గురించి మాట్లాడాల్సి వస్తే.. కేవలం ఇద్దరు మనుషుల తోనే హౌస్ లో కనెక్ట్ అయ్యాను. మధ్యలో ఒకళ్ళు వెళ్ళిపోయాక ఇంక చివరాకరికి ఒకరితోనే కనెక్ట్ అయ్యాను అది నాకు పెద్ద మైనస్ అయ్యింది అంటూ షణ్ముక్ సిరితో.. మాత్రమే హౌస్ లో ఉండటం పట్ల చివరాకరికి రియలైజ్ అయ్యాడు. ఇక చివరిగా మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే అవకాశం వస్తే వెళ్తావా అని యాంకర్ రవి… షణ్ముక్ నీ ప్రశ్నించడం జరిగింది. దానికి షణ్ముక్… బాబోయ్ నావల్లకాదు అంటూ దండం పెట్టేసాడు.


Share

Related posts

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘గెటప్’లో సెహ్వాగ్!

Teja

Crack Knuckles: చేతివేళ్ళు మెటికలు విరుస్తున్నారా..! అయితే ఇది తెలుసుకోండి..!

bharani jella

Bigg Boss Telugu OTT: రెండు సంవత్సరాలు బ్యాన్అంటూ .. ప్రముఖ షోలో అలీ రెజా వైరల్ కామెంట్స్.!!

sekhar