అందమయిన అమ్మాయిలు అంటే సినిమా హీరోయిన్స్,మోడల్స మాత్రమే అనుకునే రోజులు పోయాయి..ఇప్పుడు న్యూస్ రీడర్స కూడా తమదైన అందముతో ఆకటుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అందం, వాక్చాతుర్యం తో వీక్షకులను కట్టి పడేస్తున్నారు.
ఈ కాలం పిల్లలు సినిమాలు, వెబ్ సిరీస్ లు, అవసరమైతే కార్టూన్స్ అయినా చూస్తారు కానీ… న్యూస్ ఛానెల్స్ వైపు కన్నెత్తి కూడా చూడరు. అలాంటి వారిని తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది ఓ న్యూస్ రీడర్. ఈమె టీవీలో కనపడితే చాలు.. ఇంత అందమైన యాంకర్ న్యూస్ చదివితే చూడకుండా ఎలా ఉంటామంటూ సమాధానం చెబుతున్నారు. ఈమె పేరు అనిత సంపత్. సన్ టెలివిజన్ లో న్యూస్ రీడర్. ఆమె అందానికి ఎవరైనా ఇట్టే అట్రాక్ట్ కావాల్సిందే.ఇప్పుడే అదే దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగేలా చేసింది.టెలివిజన్ న్యూస్ రీడర్ గా చేస్తూ… ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోయింది.కేవలం న్యూస్ రీడర్ గా మాత్రమే కాకుండా.. ఆమె వనక్క తమిళా, వానిలాయి అరికాయి న్యూస్ వంటి కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది.ఇటీవలే.. ఈమె పై నెటిజన్ల చూపు పడింది. ఇంకేముంది.. రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది.చాలా మంది సింగిల్స్ కి ఇప్పుడు అనిత సంపత్.. నేషనల్ క్రష్ గా మారింది.ఈమె అందాన్ని సోషల్ మీడియాలో తెగ పొగిడేస్తున్నారు.న్యూస్ రీడర్స్ ఇంత అందంగా ఉండటం క్రైమ్ తెలుసా అంటూ.. ఆమె బ్యూటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఆమె 12జూన్ 1992లో జన్మించగా.. చాలా చిన్న వయసులోనే జర్నలిజంపై దృష్టిపెట్టింది. కాగా.. గతేడాది ఆగస్టులో ఆమెకు వివాహమైంది. కాగా.. ఆమె పెళ్లితో చాలా మంది గుండెలు పగిలిపోయాయి.