షాకింగ్ : డ్రగ్స్ కేసులో క్రికెటర్లు సూపర్ స్టార్ ల గుట్టు బయట పెట్టేసిన సంచలన నటి…!

 

బాలీవుడ్ లో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం రోజుకొక కీలక మలుపు తీసుకుంటుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత అతని గర్ల్ ఫ్రెండ్ రియా బయటపెట్టిన పేర్లు చాలా పెద్దవి. అందులో రకుల్ ప్రీత్ సింగ్, సోనమ్ కపూర్ కూడా ఉన్నారు. తాజాగా బాలీవుడ్ అగ్రకధానాయిక దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్ పేర్లు కూడా బయటకు వచ్చాయి.

 

Ready to share names and details of cocaine users if NCB summons': Sherlyn Chopra

ఇక బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ పై కన్నేసిన ఎన్సీబీ అధికారులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి మరికొందరిని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా మాట్లాడుతూ వివిధ నటీనటుల కోసం పని చేస్తున్న మేనేజర్లు ఇంకా ఎంతమంది ఇండస్ట్రీ వారికి డ్రగ్స్ అలవాటు ఉందని బయటపెట్టింది. ఈ క్రమంలోనే క్వాన్ అనే ప్రముఖ మేనేజ్మెంట్ ఏజెన్సీ కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంలోకి వచ్చింది. అయితే షెర్లిన్ చోప్రా మాట్లాడుతూ తాను ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది సూపర్ స్టార్స్ డ్రగ్స్ తీసుకోవడం చూశానని సంచలన వ్యాఖ్యలు చేసింది.

అలాగే క్రికెటర్లు తన ముందు మ్యాచ్ అయిపోయిన తర్వాత పార్టీలలో డ్రగ్స్ తీసుకుంటూ కనిపించారని అలాగే సూపర్ స్టార్ గా చలామణి అయ్యే వారి భార్యలు కూడా పార్టీలలో డ్రగ్స్ పీల్చడం తన కళ్ళారా చూశాను అని చెప్పడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. అలాగే తను తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో సంచలన విషయాలను గురించి చెప్పింది. అయితే ఏకంగా క్రికెటర్ల పై, సూపర్ స్టార్ల భార్య పైన ఇంత తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇప్పుడు షెర్లిన్ పేరు బాలీవుడ్లో మార్మోగిపోతోంది. ఇక ఆమె ఎన్సీబీ వారికి సహాయపడుతూ వారి పేర్లు బయట పడుతుందా అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.