Maharashtra Crisis: మహా సీఎంగా ఏక్‌నాథ్ శిందే.. డిప్యూటి సీఎంగా ఫడ్నవీస్.. మూహూర్తం ఖరారు

Share

Maharashtra Crisis: మహారాష్ట్రలో కొద్ది రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి నేటితో తెరపడనుంది. బలనిరూపణ అంశంపై నిన్న సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు తర్వాత కొద్ది నిమిషాల్లోనే ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray) రాజీనామా చేయడంతో.. రాష్ట్రంలో బీజేపీ, శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు ఖాయమైంది. దీంతో బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రేపు ప్రమాణ స్వీకారం చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఒక రోజు ముందుగా నేటి రాత్రే రాజ్ భవన్ లో  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. కొద్ది సేపటి క్రితం దేవేందర్ ఫడ్నవీస్, శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ శిందే లు రాజ్ భవన్ కు చేరుకుని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో భేటీ అయ్యారు.

Shiv Sena Rebel Leader Eknath shinde take oath as maharashtra new cm today night

 

శిండే వర్గంతో పాటు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు లేఖలను ఫడ్నవీస్ గవర్నర్ కు అందజేసినట్లు సమాచారం. ప్రస్తుత అసెంబ్లీలో బీజేపికి 106 మంది సభ్యులు బలం ఉండగా, శివసేన శిండే వర్గం 39 మంది, పది మంత్రి స్వతంత్రులు వీరికి మద్దతుగా ఉన్నారు. తొలుత ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏక్ నాథ్ శిందే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని  ఫడ్నవీస్ తెలిపారు. ఈ రాత్రి 7.30 గంటల సమయంలో ఏక్ నాథ్ శిందే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  శిందే మంత్రి వర్గంలో బీజేపీ చేరాలని అగ్రనాయకత్వం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు, ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందు దేవేంద్ర ఫడ్నవీస్ సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా సూచనలతో భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పాటునకు అంగీకరించారు. ఉప ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.   ఇప్పటికే మంత్రివర్గంలోకి ఎంత మందిని తీసుకోవాలి, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి అనే దానిపై ఫడ్నవీస్ – శిండేల మధ్య చర్చల్లో ఖరారైనట్లు సమాచారం.


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

11 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

36 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

2 గంటలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago