బిగ్ బాస్ షో కి వచ్చే కంటెస్టెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ షో కి వచ్చే ప్రతి కంటెస్టెంట్ తన దైన ముద్రతోనే వస్తారు. అందులో ముఖ్యంగా బిగ్ బాస్ 4లో గంగవ్వ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మై విలేజ్ షో తో ఎంతో క్రేజ్ సంపాధించుకున్నది గంగవ్వ. తెలంగాణ యాస, తనదైన సహజ నటనతోనే జనాలను తన షో వైపు ఆకట్టుకుంది ఈ గంగవ్వ. ఈ షో తోనే ఇంటర్ నెట్ లో తన పేరు మారుమ్రోగేలా చేసింది. మై విలేజ్ షో అంటే చాలు మనకు గుర్తొచ్చేది కేవలం గంగవ్వనే.
తను సంపాధించుకున్న పేరు ప్రఖ్యాతలతోనే బిగ్ బాస్ 4 లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టినప్పటినుంచి తనదైన ప్రతిభను చూపుతూనే ఉంది. మొదటి రెండు వారాల్లో బిగ్ బాస్ ఇంట్లో గంగవ్వ మాటలతో అందరినీ నవ్వించిన సంగతి తెలిసిందే. అయితే ఉన్నట్టుండి ఐదో వారంలో గంగవ్వను ఏ కారణం లేకుండా బయటకు పంపించేశారు. దీనికి గల కారణాలు చాలానే ఉన్నాయని చెప్పొచ్చు.
వచ్చిన మొదటి రెండు వారాల్లో ఆమెకు ఆ వాతావరణం పడక పోవడం మూలంగా ఆరోగ్యం కొద్దిగా క్షీణించింది. అయితే అప్పుడు ఆమె వెళ్లిపోతాని చెప్పినా బిగ్ బాస్ ఆమెకు ధైర్యం చెప్పి ఉండమని సలహా కూడా ఇచ్చారు. అలాగే ఆమె ఆరోగ్యం విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఆమెను మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆమె మొదట ఎలా ఉండేదో అలాగే ఇంట్లో మెలిగేది.
కాని ఐదో వారంలో ఆమె ఆరోగ్యం దెబ్బతిందని నాగార్జున గారు ఆమెను షో నుంచి పంపించేశారు. గంగవ్వ వెళ్లి పోవడానికి ఒక కారణం ఆమె అనారోగ్యం అయితే మరొకటి ఆమె ఎలాంటి ఫిజికల్ టాస్క్ లు చేయకపోవడం అని చెప్పొచ్చు. దీనితో ఆమె వైపున్న కంటెస్టెంట్లందరూ సేఫ్ గేమ్ లోనే వెళ్లేవారు. దీనితో టాస్క్ లప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నారని అందుకే ఆమెను పంపించారని టాక్.
దీనితో పాటు మొదట ఆమె ఉండటం మూలంగానే షో హైలెట్ కావడం జరిగింది. కానీ ప్రస్తుతం మోనాల్ గజ్జర్, అభిజీత్, అఖిల్, ముక్కు అవినాష్, నిహారిక, మెహబూబ్ ల ట్రయాంగిల్, గొడవలతో ఈ షో హైలెట్ అవుతూనే ఉంది. దీనితో గంగవ్వ ఆరోగ్యం కూడా దెబ్బతినడంతో ఆమెను షో నుంచి పంపించేశారు. కారణం ఏదైనా గంగవ్వ బిగ్ బాస్ ఇంట్లో తన దైన ముద్రను వేసుకున్నారు. ఏదేమైనా బిగ్ బాస్ ఇంట్లో అన్ని కూడా బిగ్ బాస్ కు నచ్చినట్టే జరుగుతాయని ప్రజలు అభిప్రాయం.