Siddharth Shukla Death; బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడు.. ప్రముఖ నటుడు సిద్ధార్థ్ శుక్ల మరణం ఇండియన్ స్మాల్ స్క్రీన్ ని కుదిపేసింది. తన ప్రతిభతో ఇప్పుడిప్పుడే దేశం మొత్తం అభిమానులను సంపాదించుకుంటున్న తరుణంలో సిద్ధార్థ ఆకస్మిక మరణంతో బాలీవుడ్ నిర్ఘాంతపోయింది. బిగ్ బాస్ 13 విజేతగానే అందరికీ తెలిసిన సిద్ధార్థ్ ఇప్పటి వరకు దాదాపు 20 ఓటీటీలు, ప్రముఖ సీరియళ్ళలో నటించారు. దీనిలో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది మాత్రం బాలికా వధు మాత్రమే. చిన్నారి పెళ్లికూతురుగా తెలుగులోనూ సుదీర్ఘకాలం ఈ సీరియల్ ప్రసారమైంది. సిద్దార్థ్ మరణంతో ఈరోజు బాలిక వధులో అతని నటన, ఆ సీరియల్, బిగ్ బాస్ లో అతని తీరు.. అన్నీ స్మరించుకుంటున్నారు.
Siddharth Shukla Death; తెలుగులో ఇంటింటికీ తెలుసు..!!
తెలుగులో బాగా ప్రాచుర్యం పొందిన సీరియళ్ళలో చిన్నారి పెళ్లి కూతురు ఒకటి. హిందీలో బాలికా వధు పేరిట టెలికాస్ట్ అయ్యేది. కాలక్రమేణా తెలుగులో చిన్నారి పెళ్లి కూతురుగా డబ్బింగ్ చేసి, తెలుగులో మా టీవీలో ప్రసారం చేసారు. ఈ సీరియల్ ద్వారానే నటి అవికా గోర్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. అనంతరం సిద్ధార్ధ్ శుక్లా దేశం మొత్తం ప్రాచుర్యం పొందారు. దాదాపు పదేళ్ల కిందట “బాబుల్ కా అంగన్ చూటీ” అనే టీవీ షో ద్వారా నటుడిగా పరిచయమైనా సిద్దార్థ జాన్ పీహెచ్చనే సే, లవ్ యూ జిందగీ, బాలికా వధు, దిల్ సే దిల్ తక్ అనే టీవీ షోలతో ఉత్తర భారతానా అభిమానులను గెలుచుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ 13లో ఎంటరై.. మంచి ఆటిట్యూడ్ తో.., ప్రవర్తనతో విజేతగా నిలిచారు. ఈ గెలుపు అతని జీవితాన్ని మలుపు తిప్పింది. సినిమాలు, ఓటీటీల్లో అవకాశాలు తెచ్చి పెట్టింది.
ఆమెతో గొడవే కారణమా..!?
సిద్ధార్ధ్ వయసు 40 మాత్రమే. కానీ ఈ వయసులోనే ఆయనకు గుండెపోటు రావడం.. ఆసుపత్రిలో చేరి ఆకస్మికంగా మరణించడం అనేక అనుమానాలకు తావిస్తుంది. తన ప్రియురాలు షెహనాజ్ గిల్ తో ఉన్న మనస్పర్థలే అతనిలో మానసిక ఒత్తిడిని పెంచి గుండెపోటుకు కారణమయ్యాయని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మరణించే సమయానికి సిద్దార్థ్ దగ్గర తన తల్లి, ఇద్దరు సోదరీలు మాత్రమే ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.