Bigg Boss 6 Telugu: తెలుగు బిగ్ బాస్ షోలో ప్రతి సీజన్ లో కంటెస్టెంట్ యొక్క సంబంధించి యాంకర్.. అదేవిధంగా సింగర్ మరియు సీనియర్ యాక్టర్ ల ను ఖచ్చితంగా తీసుకుంటారు. ఫస్ట్ సీజన్ లో గీతా మాధురి, ఆ తర్వాత సీజన్ లో.. మరొక లేడీస్ సింగర్.. సీజన్ త్రీ లో రాహుల్ సిప్లిగంజ్.. తీసుకోగా సీజన్ ఫోర్ లో నోయల్ కి అవకాశం ఇచ్చారు. ఇక సీజన్ ఫైవ్ లో శ్రీ రామచంద్ర కి అవకాశం ఇవ్వటం జరిగింది. దాదాపు సింగర్లు తెలుగు బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ అందించటంలో ముందు ఉంటూనే.. చివరాకరికి టాప్ మోస్ట్ స్థానాలలో విజయం సాధించడం జరిగింది.
సీజన్ త్రీ లో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ ట్రోఫీ గెలవగా… ఆ తరువాత సీజన్ ఫైవ్ లో.. టాప్ త్రిగా శ్రీ రామచంద్ర నిలిచాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓటీటీ బిగ్ బాస్ లోకి యంగ్ సింగర్ హేమచంద్రకి అవకాశం ఇచ్చే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే హేమచంద్ర తో మంతనాలు జరిపినట్లు అతడు కూడా పాజిటివ్‌గానే రెస్పాండ్ అయినట్లు.. పైగా ఓటిటి బిగ్ బాస్.. హౌస్ లో జరిగే 24 గంటలు కవర్ అయ్యే పరిస్థితి ఉండటంతో హేమచంద్ర కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రావటానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో హేమచంద్రతో పరంగా నిర్వాహకులు డిస్కషన్ చేసినట్లు అంతా ఓకే అయితే ఫిబ్రవరి మూడో వారంలో పురం లో రిలీజ్ అయిన తర్వాత కంటెస్టెంట్ ల లిస్ట్ సమయంలో అతని పేరు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు.. టెలివిజన్ రంగంలో వార్తలు వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో అనేక టాప్ మోస్ట్ పాటలకు గొంతు అందించిన హేమచంద్ర.. పలువురు టెలివిజన్ రంగంలో పాటల పోటీలలో కూడా పోటీ పడటం జరిగింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లో.. ఈసారి సింగర్ కోటాలో హేమచంద్ర రానున్నట్టు సమాచారం.