NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Skin Glowing: అర్జెంటుగా బయటకు వెళ్లాలా..!? కేవలం 15 నిమిషాలకు ముందు ముఖానికి రాసుకోండి.. తెల్లగా మెరిసిపోతారు..

Skin Glowing: అందంగా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.. ఇందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. బ్యూటీ పార్లర్ కు వెళుతూ డబ్బులు వృధా చేసుకుంటూ ఉంటారు.. మరి కొంత మంది బ్యూటీ క్రీమ్స్ వాడుతూ ఉంటారు.. రసాయన క్రీమ్స్, ఫేస్ ప్యాక్ వంటివి ఎన్ని ఉపయోగించిన అవి తాత్కాలిక పరిష్కారాన్ని మాత్రమే అందిస్తాయి.. మన ఇంట్లోని చక్కటి చిట్కాలను పాటిస్తూ చర్మానికి నిగారింపు తెచ్చుకోవచ్చు.. ఎప్పుడైనా అర్జెంటుగా ఫంక్షన్ కో, పార్టీ కో, ఎక్కడికైనా వెళ్లవలసి వస్తే 15 నిమిషాలలో ఈ చిట్కా ప్రయత్నించి చూడండి.. మిలమిల మెరిసే మోము మీ సొంతమవుతుంది.. మెరిసే మీ ముఖాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు..!! ఇంట్లోనే తయారుచేసుకునే ఈ చిట్కా ప్రయోజనాలు చేస్తే ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటిస్తారు..!! ఈ అద్భుతమైన ఇంటి చిట్కాలు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం..!!

Skin Glowing: ముఖ నిగారింపు కోసం ఇంటి చిట్కా..!!

కావలసిన పదార్థాలు:

శెనగపిండి – 1 టేబుల్ స్పూన్, టమాటా గుజ్జు 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, పసుపు చిటికెడు.

ముందుగా టమాటాలను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీ పట్టుకొని గుజ్జులా తయారు చేసుకోవాలి.. ఇలా తయారుచేసుకున్న టమోటా గుజ్జు లో శెనగపిండి ఉప్పు చిటికెడు పసుపు వేసి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ముందు శుభ్రంగా మొహాన్ని పడుకొని తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకోవాలి.. ఇలా పదిహేను నిమిషాలు ఉంచుకోవాలి. ఆ తరువాత వేళ్ళతో రుద్దుకుంటూ చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.. మెత్తటి కాటన్ టవల్ తో ముఖాన్ని తుడుచుకోవాలి ఇప్పుడు మీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటే రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇలా ప్రతి వారానికి ఒకసారి చేస్తే ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు..

Skin Glowing: 15 Minutes Home Face Pack excellent results
Skin Glowing 15 Minutes Home Face Pack excellent results

Skin Glowing: శెనగపిండి ఫేస్ ప్యాక్ ప్రయోజనాలు ఇవే..!!

శెనగపిండి చర్మానికి చక్కగా పనిచేస్తుంది. దీనిలో సహజంగా మొటిమలను తగ్గించే లక్షణాలు ఉన్నాయి. కొన్ని శతాబ్దాలు పాటుగా చర్మసౌందర్యానికి శనగపిండిని వాడుతున్నారు. దీనిలో ఉండే జింక్ ముఖంపై వచ్చే మొటిమలకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ముఖం పై ఉన్న అదనపు జిడ్డును తొలగించడమే కాకుండా ఉత్పత్తి అవకుండా కూడా దోహదపడుతుంది. చర్మం కాంతివంతంగా మారేలా చేస్తుంది. దీనిలో అల్కలైజింగ్ లక్షణాలను కలిగి ఉంది. చర్మం లోపల ఉండే దుమ్ము, ధూళి తొలగిస్తుంది. చర్మంపై తేమ ను సక్రమంగా ఉంచుతుంది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. నలుపు ను తొలగించి ప్రకాశవంతమైన అందాన్ని ఇస్తుంది. టమోటా క్లైన్సింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

టమోటా చక్కటి ఇ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది దీనిలో ఉండే విటమిన్ సి మృతకణాలను తొలగిస్తుంది. మొటిమల కారణంగా ఏర్పడిన ట్యన్ ను తొలగిస్తుంది. మొటిమలు పిగ్మెంటేషన్ కు టమాటా చక్కగా పనిచేస్తుంది. ఉప్పులో ఉండే మెగ్నీషియం చర్మం లోపల నీటి నిల్వలు ఉండకుండా దోహదపడుతుంది . హైడ్రేట్ గా సహాయపడుతుంది. పసుపు చక్కటి యాంటీబ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. మొటిమలు, మచ్చలు రాకుండా కాపాడుతుంది ముఖం కాంతివంతంగా మారేలా చేస్తుంది. శెనగపిండి, టమాట, ఉప్పు పసుపు కలిపిన ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం బిగుతుగా అయి ప్రకాశవంతమైన వర్చస్సును కలిగిస్తుంది. అప్పటికప్పుడు ఈ ఫేస్ ప్యాక్ వేసుకొని పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే కూడా చక్కటి గ్లో మీ సొంతమవుతుంది.. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫేస్ ప్యాక్ ను ట్రై చేయండి. అద్భుత ఫలితాలను పొందండి.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju