బిగ్ బాస్ 4 : దివి కిడ్నాప్ చూసి బూతులతో రెచ్చిపోయిన సోహెల్..! మోనాల్, అమ్మ కెమరా ముందుకొచ్చి….

బిగ్ బాస్ షో మూడవ వారం మంచి రసపట్టులో ఉంది. నామినేషన్ ప్రక్రియలోనే ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డ కంటెస్టెంట్స్ ఇక ఫిజికల్ టాస్క్ దగ్గరికి వచ్చేసరికి రెచ్చిపోయారు. అసలు ఇప్పటి వరకు బిగ్ బాస్ వారికి ఈ రేంజ్ ఫిజికల్ టాస్క్ ఇవ్వలేదు కానీ…. నిన్న ఇచ్చిన ఉక్కు హృదయం టాస్క్ భారీగా వర్కౌట్ అయింది.

 

మనుషులు, రోబోలు అని రెండు టీం లుగా కంటెస్టెంట్స్ విడిపోయి ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. ఇక వీరిద్దరి మధ్య పెద్ద తగాదా కూడా పడింది. టాస్క్ సింపుల్… ఒక సిల్వర్ బంతిని పగలగొడితే ఒక రోబో చనిపోతుంది. చివరికి ఒక్క రోబో మిగిలినా మనుషుల ఓడిపోతుంది. అయితే గెలిచిన టీమ్ సభ్యులే కెప్టెన్సీ పోటీ కి అర్హులు అని బిగ్బాస్ లింక్ పెట్టాడు. ఇక ఈ టాస్క్ లో గార్డెన్ ఏరియా మనుషులది.. రోబోలకి కావాల్సిన ఛార్జింగ్ వారి ఆధీనంలో ఉంటుంది. మనుషులకు కావలసిన అవసరాలు అన్నీ రోబో ల ఆధీనంలో ఉంటాయి. ఒక ఒప్పందానికి వచ్చి ఇచ్చిపుచ్చుకుని టాస్క్ ను ముందుకు తీసుకెళ్లాలి.

మొదట రాజశేఖర్ కు సిగిరెట్ ఇవ్వడానికి రోబో టీమ్ బెట్టు చేసింది. అక్కడి వారికి అస్సలు బేరం కుదరలేదు. సిగరెట్ కోసం ఒకరికి చార్జింగ్ అనే ఒప్పందాన్ని వారు ఒప్పుకోలేదు. ఇక ఇదే సమయంలో రోబోల దగ్గర చార్జింగ్ పూర్తిగా తగ్గిపోతుంటే వారిని మనుషుల టీమ్ హేళన చెయ్యడం మొదలుపెట్టింది. అప్పుడే అభిజిత్ మాస్టర్ ప్లాన్ వేసాడు. శారీరకంగా కాకుండా బుద్ధిబలంతో ఒక అదిరిపోయే తన ఐడియా సభ్యులకు ఇచ్చాడు.

ప్లాన్ ప్రకారం దివి ని లోపలకి తీసుకుని వచ్చి కిడ్నాప్ చేశారు. ఆమె చేతులు కాళ్ళు పట్టుకొని ఛార్జింగ్ పెట్టేసుకున్నారు. ఇక ఈ దెబ్బతో మెహబూబ్, సోహెల్ రెచ్చిపోయారు. సోహెల్ అయితే బూతులు కూడా వాడేశాడు. మెహబూబ్ దమ్ముంటే నన్ను తీసుకెళ్ళరా అని సవాల్ విసిరాడు. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ ప్రేక్షకులని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేయనుంది