వచ్చే నెల నుండి బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ కానుంది. నెక్స్ట్ సీజన్ కి కూడా హోస్ట్ గా నాగార్జున చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సీజన్ సిక్స్ కి సంబంధించి ప్రోమో షూటింగ్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. దాదాపు వరసగా నాలుగు సీజన్ లకు నాగార్జున యే హోస్ట్ గా చేస్తున్నారు. తెలుగు టెలివిజన్ రంగంలో దాదాపు బిగ్ బాస్ అన్ని సీజన్ లకి మంచి ప్రేక్షకు ఆదరణ లభించింది. గత రెండు సీజన్లు చూస్తే చాలా వరకు టెలివిజన్ మరియు సోషల్ మీడియా రంగంలో సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. ఒకరిద్దరూ టీవీ యాంకర్ లతోపాటు న్యూస్ రిపోర్టర్ లు రావడం జరిగింది.
ఇదిలా ఉంటే ఈసారి సీజన్ సిక్స్ కి సినిమా ఇండస్ట్రీలో కీలకమైన నటి నటులు… కంటెస్టెంట్ లుగా అడుగుపెట్టనున్నారట. దీంతో సీజన్ సిక్స్ బిగ్ బాస్ కుటుంబ సభ్యులకు భారీ ఎత్తున రెమ్యూనరేషన్ పెంచడం జరిగిందంట. గత ఐదు సీజన్లకు కంటెస్టెంట్లకు ఇచ్చిన దానికంటే రెట్టింపుగా సీజన్ సిక్స్ సభ్యులకు షో నిర్వాహకులు ఇస్తున్నట్లు సమాచారం. దాదాపు 100 రోజులకు పైగా జరగబోయే ఈ షో సెప్టెంబర్ చివరి వారంలో మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట.
చాలావరకు తెలిసిన ముఖాలే… సీజన్ సిక్స్ లోకి ఎంట్రీ ఇప్పించే రీతిలో షో నిర్వాహకులు సెలెక్ట్ చేసినట్లు సమాచారం. అంత మాత్రమే కాదు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎపిసోడ్ లకి సంబంధించి ఎటువంటి లీకులు లేకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారట. ముఖ్యంగా వీకెండ్ ఎపిసోడ్ టైం లో ఎవరు ఎలిమినేట్ అవుతారు … అనే దాని గురించి ఎక్కడా కూడా హౌస్ నుండి సమాచారం బయటకు రాకుండా షోనిర్వాహకులు పగడ్బందీగా వ్యవహరించినట్లు.. సరికొత్త ప్లాన్ అనుసరిస్తున్నట్లు సమాచారం.