Subscribe for notification

Lakshmikanth Reddy: ప్రతి ఆటో డ్రైవర్ తెలుసుకోవాల్సిన స్టోరీ..IIM లో సీటు సంపాదించిన తెలంగాణ ఆటో డ్రైవర్ కొడుకు..!!

Share

Lakshmikanth Reddy: ప్రస్తుత రోజుల్లో చాలా వరకు మోటార్ ఫీల్డ్ అనేసరికి కష్టపడటం ఏమోగానీ.. వచ్చిన డబ్బులతో జల్సా చేసేవాళ్ళు ఎక్కువ. ఆటో తొలి వచ్చిన కిరాయి డబ్బులతో దురలవాట్లకు లోనై కుటుంబాలను, పిల్లలను బాధలకు గురి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరికొంతమంది అప్పులు చేసి .. బాధ్యత లేకుండా తిరిగే వాళ్ళు కూడా సమాజంలో తారసపడతారు. కానీ తెలంగాణలో ఒక ఆటో డ్రైవర్ కొన్ని దశాబ్దాల పాటు ఆటో తొలి.. తన కొడుకుని.. సమాజంలో ఉన్నత చదువు అందించే  విద్యా సంస్థలో జాయిన్ అయ్యేలా వెనకనుండి చేసిన కృషి ఇప్పుడు దేశంలోనే సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆటోడ్రైవర్ కొడుకు లక్ష్మీకాంత్ రెడ్డి. ఇతను ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) అహ్మదాబాద్ లో 2021లో సీటు సంపాదించాడు.

అయితే లక్ష్మీకాంత్ రెడ్డి ఇటువంటి ఉన్నతమైన విద్యా సంస్థలో సీటు సంపాదించడానికి పడిన ప్రయాస అంతా ఇంతా కాదు. లక్ష్మీకాంత్ రెడ్డి తండ్రి ఆటో డ్రైవర్. ఆయన చిన్నప్పుడు ఆటో నడుపుతూ.. ఇతర పిల్లలను తన ఆటోలో ఎక్కించుకుని ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ లో దింపేవాడు. ఆ సమయంలోనే తన కొడుకు కూడా ఇటువంటి విద్యాసంస్థలో చదవాలని కలలు కనటం మాత్రమే కాదు..అందుకోసం ప్రతి రోజు కష్టపడి రాత్రి, పగలు ఆటో తోలీ ఎట్టకేలకు లక్ష్మీకాంత్ రెడ్డి నీ ఎనిమిదవ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియం ఉన్నత విద్యను అందించే కాన్వెంట్ లో జాయిన్ చేశాడు. అనంతరం లక్ష్మీకాంత్ రెడ్డి “శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ” విద్యా సంస్థలో కళాశాల విద్యనభ్యసించారు. ఇక ఇదే సమయంలో లక్ష్మీకాంత్ రెడ్డి.. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే స్కాలర్ షిప్ సంపాదించడం జరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్.. 2016 సంవత్సరంలో పూర్తి చేశారు. సరిగ్గా కాలేజ్ నుండి బయటకు వచ్చే సమయానికి లక్ష్మి కాంత్ రెడ్డి తండ్రి ఆటో డ్రైవర్ కుటుంబ భారాన్ని మోస్తూ.. అనేక రీతులుగా కష్టపడుతూ.. ఉన్న కొద్ది ఆర్థిక భారం ఎక్కువ కావడంతో బంధువుల సహాయం తీసుకుని తన కొడుకును చదివించాడు.

ఆ తర్వాత 2016లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. బయటకు వచ్చిన లక్ష్మీకాంత్ రెడ్డి.. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అనంతరం తన స్నేహితులతో కలిసి.. 2019లో టెర్రస్ గార్డెన్ ఫార్మింగ్ వ్యవసాయం ప్రమోట్ చేయడం జరిగింది. అయితే ఇదే సమయంలో మహమ్మారి వైరస్ ఎంట్రీ ఇవ్వటంతో పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. ఈ క్రమంలో లక్ష్మీకాంత్ రెడ్డి 2020లో కష్టపడి 2021లో క్యాట్ నీ సంపాదించడం జరిగింది. దీంతో దేశంలోనే అత్యున్నత బిజినెస్ స్కూల్ .. ఐఐఎం అహ్మదాబాద్ లో సీటు సంపాదించాడు. ఈ సందర్భంగా లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ స్థాయిలో జీవితంలో రాణించడానికి తన తండ్రి కారణం అని తెలియజేశాడు. రాత్రింబగళ్ళు ఆటో నడిపి ఎంతో కష్టపడి.. నన్ను ఈ స్థాయిలో వచ్చేలా చేశారు. సొంత ఇల్లు కట్టుకోవడానికి దాచుకున్న డబ్బులు కూడా నా చదువు కోసం మా తల్లిదండ్రులు ఖర్చు పెట్టారు. ఖచ్చితంగా వాళ్ల కలలు నెరవేరుస్తాను. వ్యాపార రంగంలో తిరుగులేని వ్యాపారవేత్తగా రాణించాలని.. గమ్యంగా పెట్టుకున్నాను. ముందుగా వాళ్లకు ఇల్లు కట్టించి తర్వాత పెద్ద వ్యాపారవేత్త అయ్యేలా జీవితంలో రాణిస్తానని లక్ష్మీకాంత్ రెడ్డి.. తన తండ్రి గురించి గొప్పగా తెలియజేశారు. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో చాలామంది లక్ష్మీకాంత్ తండ్రి ఆటో డ్రైవర్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రతి తండ్రి.. తమ స్వార్థం.. సుఖం కోసం కాకుండా ఈ రీతిగా కష్టపడితే వచ్చే తరానికి మంచి భవిష్యత్తు ఇచ్చిన వారవుతారు..కుటుంబ తలరాతలు కూడా మారిపోతాయి అని కామెంట్లు చేస్తున్నారు.


Share
sekhar

Recent Posts

Salman Khan: తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కి ఊహించని షాక్ ఇచ్చిన సల్మాన్ ఖాన్..??

Salman Khan: ప్రస్తుతం చాలావరకు సినిమా నిర్మాణానికి సంబంధించి సౌత్ ఇండియా టాలెంట్ హవా కొనసాగుతుంది. ఈత బాలీవుడ్(Bollywood) స్టార్…

57 mins ago

Indian Film Industry: 2022 ఫస్టాఫ్ సౌత్ ఇండియా సినిమాలతో ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ..!!

Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…

2 hours ago

Balakrishna: బాల‌య్య ఈస్ బ్యాక్‌.. బ‌రిలోకి దిగేది ఎప్పుడంటే?

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వారం రోజుల క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…

3 hours ago

BJP: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు.. అధికార టీఆర్ఎస్‌లో చేరిక

BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…

3 hours ago

Shruti Haasan: ప్ర‌తి మ‌హిళ‌కు తెలుసు.. నేనూ ఆ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నా: శ్రుతి హాస‌న్

Shruti Haasan: త‌మిళ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్…

4 hours ago

Dasara: ఆగిపోయిన నాని `ద‌స‌రా` మూవీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Dasara: న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా`.…

5 hours ago