NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

తండ్రి మందు బాటిల్స్ ఇస్తే.. అమ్మి ఇల్లు కడుతున్న కొడుకు

son sells birthday gifted whisky bottles to build house

సాధారణంగా తమ పిల్లల పుట్టినరోజుకు తల్లిదండ్రులు బొమ్మలు, పుస్తకాలు.. గిఫ్ట్స్ గా ఇస్తూంటారు. కానీ.. చిన్నపిల్లాడైన కొడుక్కి ఓ తండ్రి ఏకంగా విస్కీ బాటిల్స్ ఇచ్చాడంటే నమ్మగలమా..? కానీ జరిగింది. అత్యంత అరుదైన ఈ ఘటన స్కాట్లాండ్ లో జరిగింది. ఓ తండ్రి 28 ఏళ్లుగా తన కొడుకు ప్రతి పుట్టినరోజుకీ ఓ విస్కీ బాటిల్ కొనిచ్చాడు. అది కూడా 18 సంవత్సరాల ఓల్డ్ విస్కీ బాటిల్. అయితే.. మొదటి పుట్టినరోజు నుంచి 28వ పుట్టినరోజు వరకూ 28 బాటిల్స్ అందుకున్న ఆ కొడుకు ఆ బాటిల్స్ తో ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది.

son sells birthday gifted whisky bottles to build house
son sells birthday gifted whisky bottles to build house

28 ఏళ్లుగా తన తండ్రి గిఫ్ట్స్ గా ఇచ్చిన 28 బాటిల్స్ అమ్మి వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. స్కాట్లాండ్ కు చెందిన పేట్ కు 1992లో కొడుకు మాథ్యూవ్ రాబ్సన్ పుట్టాడు. మొదటి పుట్టినరోజుకి గిఫ్ట్ గా 18 ఏళ్ల క్రితం నాటి (1974) విస్కీ బాటిల్ ఇచ్చాడు. బిడ్డ తలమీద ఓ సంప్రదాయంగా ఆ బాటిల్ పెట్టాడు. 18 ఏళ్లపాటు ఇవ్వాలనుకుంటే ఏకంగా 28 ఏళ్లపాటు ఇస్తూనే ఉన్నాడు. ‘బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చిన బాటిల్స్ కు 5 లక్షలు ఖర్చయ్యాయి. అదొక్కటే నా కొడుక్కి ఇచ్చాను. ఇప్పుడదే లక్ గా మారింది’ అని చెప్పుకొచ్చాడు పేట్.

అయితే.. ఇన్నేళ్లపాటు ఆ బాటిల్స్ ఉంచడంతో వాటి విలువ 40 లక్షలకు పెరిగింది. ఈ మొత్తంతోనే మాథ్యూ ఇల్లు కొట్టుకోవాలని అనుకుంటున్నాడు. ‘ఇదొక అరుదైన గిఫ్ట్. అయితే..  ఈ విస్కీ బాటిల్స్ తాగకుండా అలానే ఉంచుకోవాలని ఫిక్స్ అయ్యాను.. అలానే ఉంచుకున్నాను’ అని టాంటన్ లో ఉంటున్న మాథ్యూ చెప్పాడు. ఈ విస్కీ బాటిల్స్ అమ్మకాన్ని ఓ కెంపెనీకి అప్పగించారు. విస్కీ అమ్మకందారుడు మార్క్ లిట్టర్ ఈ బాటిల్స్ అమ్మనున్నాడు. ‘మెకల్లాన్’ విస్కీ ఓల్డ్ బాటిల్స్ దొరకడం విశేషం. ఇప్పటికే ఈ బాటిల్స్ కు న్యూయార్క్, ఆసియా నుంచి ఆర్డర్లు వస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.

 

 

 

author avatar
Muraliak

Related posts

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju