Sonali Bendre: కంటతడి పెట్టిస్తున్న సోనాలి బింద్రే పోస్ట్..!!

Share

Sonali Bendre: టాలీవుడ్ అందాల రాశి సోనాలి బింద్రే గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.. తెలుగులో దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించింది ఈ ముద్దుగుమ్మ.. కొన్నాళ్ల క్రితం సోనాలి క్యాన్సర్ బారిన పడి కోలుకుంది.. నిన్న క్యాన్సర్ సర్వైవర్ డే..  క్యాన్సర్ ను జయించిన వారి దినోత్సవం సందర్భంగా సోనాలి బింద్రే తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు.. అప్పుడు తను ఎలా ఉందో ఒక పిక్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు..!! ఈ ఫోటో చూసిన అభిమానులను కంటతడి పెట్టిస్తుంది..!!

Sonali Bendre: recalls her cancer days

Sonali Bendre: recalls her cancer days2018 లో సోనాలి బింద్రే క్యాన్సర్ తో పోరాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే సోనాలి కి మెటా స్టాటిక్ క్యాన్సర్ సోకింది. ఈ క్రమంలో చికిత్స కోసం ఆమె అమెరికాకు వెళ్లారు. కొన్నాళ్ళు అక్కడే ఉండి క్యాన్సర్ తో పోరాడి జయించి ఇండియాకు తిరిగి వచ్చారు.. ఈ సమయంలో ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు పట్టుదలతో ముందుకు సాగింది అంతే కాకుండా ఈ పోరాటంలో ఆమె భర్త గోల్డీ బెహ్ల్, ఆమె కుమారుడు రణవీర్ ఆమెకు అండగా నిలిచారు సోనాలి బతకడానికి 30 శాతం మాత్రమే అవకాశం ఉందని వైద్యులు తనతో చెప్పారని తెలిపారు. అయినా తాను పట్టుదలతో పోరాడానని చెప్పారు. నిన్న క్యాన్సర్ సర్వైవర్ డే సందర్భంగా సోనాలి నాటి రోజులను గుర్తు చేసుకుంది. కాలం ఎంత త్వరగా గడిచిందో వెనక్కి తిరిగి చూసుకుంటే నా బలం, బలహీనతలు గుర్తుకు వస్తున్నాయి. మరి ముఖ్యంగా దీని తరువాత ప్రపంచం నన్ను ఎలా చూస్తుంది అనే విషయాన్ని పట్టించుకోలేదు. మనం కోరుకున్నట్టుగానే మన జీవితం ఉంటుంది. మనకు నచ్చినట్టుగా ఈ ప్రయాణాన్ని మలుచుకోవచ్చు అని సోనాలి బింద్రే చెప్పుకొచ్చారు..


Share

Related posts

‘ఇక కార్పోరేషన్ ఇసుక’

somaraju sharma

సైమా వేడుక‌కి అతిథులుగా చిరు, మోహ‌న్‌లాల్‌

Siva Prasad

సీఎం క్యాంప్ ఆఫీసులోనే హైకోర్టు

somaraju sharma