Sonu Sood: సోనుసూద్ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి సహాయం అని అర్ధించిన వెంటనే నేనున్నానంటూ ముందుకు వస్తున్నాడు సోను.. రీల్ విలన్ కాస్త రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. సోను కి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. కొందరు అతనికి గుడి కట్టి పూజలు చేస్తుంటే మరికొందరు వారి పిల్లలకు పేర్లు పెట్టుకున్నారు.. ఇటీవల సోనూసూద్ ని కలవడం కోసం ఓ అభిమాని ఏకంగా తొమ్మిది వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి సోనూసూద్ ని కలిసిన సంగతి తెలిసిందే.. తాజాగా ఓ అభిమాని సోను ని కలవడానికి కోసం 1200 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేశాడు..!!
తాజాగా ఒక అభిమాని సోను ని కలవడానికి పూరి నుండి 1200 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసి ఎట్టకేలకు సోను ఇంటికి చేరుకున్నాడు.. సింబా అనే అభిమాని సోనూసూద్ కు పూల దండలు వేసే ప్రయత్నం చేస్తా సోను సూద్ ఆ దండను ఆ అభిమాని కే వేశాడు.. సింబా తనకు ఉన్న గౌరవం తో సోను పాదాలపై పూలు వేసే ప్రయత్నం చేయగా వద్దని వారించారు. తరువాత తన అభిమాని పాడిన పాట విని పరవశించి పోయాడు సోనుసూద్.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
अपने सूपर फैन से सोनू सूद ने की मुलाकात!
सोनू सूद से मिलने के लिए इस फैन ने साइकल से पूरी की 1200 किलोमीटर की यात्रा! #SonuSood #COVID19 | @SonuSood pic.twitter.com/ehEYG3nIVz
— News Tak (@newstakofficial) July 16, 2021