లాక్ డౌన్ సమయం లో వలస కూలీల ను ఆ తర్వాత అనేకమందిని ఆదుకుంటూ నిజమైన హీరో అనిపించుకుంటున్న సోనుసూద్ కి దేశంలో ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే చాలా సంస్థలు సోనుసూద్ చేస్తున్న సేవలను గుర్తించి పురస్కారాలు కూడా అందజేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల తన అత్తగారి ఊరు ఆంధ్రప్రదేశ్ అని.. నేను తెలుగువారి అల్లుడిని అంటూ సోనుసూద్ చెప్పడం అందరికీ తెలిసిందే.
కాగా తాజాగా సోనుసూద్ హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలకు తన సేవలు అందే విధంగా సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. మేటర్ లోకి వెళ్తే హైదరాబాదులో అంబులెన్స్ సర్వీస్ స్టార్ట్ చేసాడు. ఇటీవల కొన్ని వాహనాలను కొనుగోలు చేసి వాటిని అంబులెన్సులు గా మార్చి ప్రజలకు సాయపడేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఏరియా లో తన అమూల్యమైన సర్వీసులను లాంచ్ చేసి రానున్న రోజుల్లో వీటిని మరింత విస్తృతంగా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించేలా సోనుసూద్ టీమ్ చర్యలు తీసుకోబోతున్నరట.
ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సోను సూద్ చేసిన సహాయ కార్యక్రమాలకు చాలా చోట్ల ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. ఒక చోట ఏకం గా సోనూసూద్ కి ప్రజలు కూడా కట్టడం జరిగింది. ఇలాంటి తరుణంలో హైదరాబాదులో అంబులెన్స్ సర్వీసులు సోనూసూద్ అందుబాటులోకి తీసుకురావటం ఇప్పుడూ సంచలనంగా మారింది.