Sonu Sood: తనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పిన సోనుసూద్..!!

Share

Sonu Sood: గత ఏడాది లాక్ డౌన్ టైం నుండి దేశంలో అనేక రకాల మంచి పనులు సోను సూద్ చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ ఆగిపోవడంతో చాలా రాష్ట్రాలలో వలస కూలీలు పనులు లేక.. సొంత ఇల్లుకి వెళ్లాలంటే.. బస్సులు, రైలు గాని లేకపోవటంతో…. హైవే మీద .. కాలినడకన వేల కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ ప్రక్రియలో భాగంగా చాలా మంది వలస కూలీలు మార్గమధ్యలోనే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉండగా సరిగ్గా ఆ టైంలో ప్రభుత్వాలు కూడా పెద్దగా పట్టించుకోని పరిస్థితుల్లో సోనుసూద్ రంగంలోకి దిగి సొంత డబ్బులతో ప్రత్యేకమైన రైళ్లు, విమానాలు, బస్సులు ఏర్పాటు చేసి వలస కూలీలను .. వారి సొంత ఇళ్లకు చేర్చటం జరిగింది. ఆ తర్వాత దేశంలో పరిస్థితులు చక్కబడ్డాక లాక్ డౌన్ ఎత్తివేసిన..గాని సోను సూద్ తన  సహాయ కార్యక్రమాలు ఏ మాత్రం ఆపలేదు.

Sonu Sood gifts mobile phones to 100 crew members : Bollywood News – Mekhato

చాలామంది పేదవాళ్ళ పిల్లలను చదివిస్తూ ఉపాధి లేని వారికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. కాగా ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా… కరోనా బారిన పడిన అనేక మంది.. రోగులు సరైన టైంలో ఆక్సిజన్ అందక మరణిస్తున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో కూడా సోనూసూద్ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తూ, రాష్ట్రాలలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి అనేక మంది ప్రాణాలను నిలబెడుతున్నారు. ఈ తరుణంలో ఇంత భారీ ఎత్తున మంచి పనులు చేయాలంటే కచ్చితంగా డబ్బులు ఉండాల్సిందే. అంత డబ్బు సోనుసూద్ కి ఎక్కడనుండి వస్తున్నాయి అనేది గత ఏడాది నుండి సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది.

Read More: Sonu Sood: స్పెషల్ టీం టోల్ ఫ్రీ నెంబర్ లతో.. సోనూసూద్ సేవలు..!!

ఇలాంటి తరుణంలో సోషల్ మీడియాలో ఇటీవల నెటిజన్ల తో చిట్ చాట్ చేసిన సమయంలో ఈ ప్రశ్నకు సోనూసూద్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో తాను చేసిన మంచి పనులకు గాను చాలామంది స్పందించి భాగస్వాములు అవుతూ విరాళాలు ప్రకటించడం జరిగింది. తన డబ్బు తో పాటు వారి డబ్బును కూడా సోనూసూద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా … దేశవ్యాప్తంగా ఎన్ని మంచి పనులు చేస్తున్నట్లు సోను సూద్ స్పష్టం చేశారు. కేవలం ప్రాణాలు కాపాడటం మాత్రమే కాదు… అనేక మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు.. అనేక కంపెనీలతో భాగస్వాములై ఇప్పటి వరకు రెండు లక్షల మందికి… ఉద్యోగాలు ఇప్పించినట్లు స్పష్టం చేశారు.


Share

Related posts

రేపు ఉదయాన్నే ఏలూరుకు జగన్…! అధికారులకు దండన తప్పదా…?

arun kanna

భారీ స్కాం?! బొత్స, విజ‌య‌సాయి క‌లిసి ఏం చేస్తున్నారంటే…

sridhar

బాబు ఆ తప్పు చేసి శిక్ష అనుభవించారు! అయినా జగన్ అదే బాటలో పోతున్నారు!!

Yandamuri