ఎస్పీ బాలసుబ్రమణ్యం నివాళి: సిగిరెట్ అంటే పిచ్చి కానీ ఆమె కోసం ఆపేశాడు!

పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా మానేయడానికి ఎంతోమంది ఇష్టపడరు. పొగకే బానిసలు అవుతారు. అలాంటిది మానేయడం నిజంగా కష్టమైనదే. ఎంతోమంది తన కుటుంబ సభ్యులు చెప్పిన వినని వాళ్ళు ఉన్న ఈ కాలంలో ఎస్పీ బాలసుబ్రమణ్యంను మాత్రం కేవలం ఒక మాతృత్వంలాంటి స్నేహం తనను మానిపించేలా చేసింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా… ఆమెనే జానకమ్మ.

 

జానకమ్మ, ఎస్పీ బాలసుబ్రమణ్యం గార్ల మధ్య అనుబంధం తల్లీ కొడుకుల ప్రేమలాగా అనిపిస్తుంది. వీరిద్దరు కలిసి వేదిక మీదకు వస్తే అంతే సంగతి. వాళ్లు పాడే పాటల ఉత్సాహం కంటే.. వాళ్ళ మధ్య జరిగే సంభాషణ మరింత ఆనందాన్ని ఇస్తుంది. అసలు బాల సుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా పరిచయం చేసిందే జానకమ్మ గారు. ఆమె అంటే ఆయనకి అమ్మ కంటే ఎక్కువ. జానకమ్మ మాటలే ఆయనను ముందుకు నడిపింది. జానకమ్మ అంటే బాలు గారికి గొప్ప అభిమాని.

గాయకులలో ఆమె తర్వాతనే ఎవరైనా అని ఎన్నోసార్లు తన మాటల్లో వినిపించారు. అందుకేనేమో ఆమె ఒక మాట చెప్పేసరికి తనని బానిస చేసిన సిగరేటు ను మానిపించేసింది. దాదాపుగా 20 సంవత్సరాలకు పైగా ఆయన సిగరెట్ మానేయడం జరిగింది. కానీ ఈ రోజు ఆయన గాన గాంధర్వం మూగబోయింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు తుది శ్వాస విడిచారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో ఆగస్టు 4న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు.

కరోనా నుంచి బయటపడిన వేరే ఇతర అనారోగ్య సమస్యల వల్ల చికిత్స అందుకుంటూ ఆరోగ్య పరిస్థితి నుండి కోలుకోక పోవడంతో ఈరోజు మధ్యాహ్నం తన జీవితానికి సెలవు ఇచ్చుకున్నారు. దాదాపుగా 40 వేలకు పైగా పాడిన పాటలు ఈరోజుతో ఇక్కడ వదిలేసి ప్రేక్షకుల హృదయాలను కంటతడి పెట్టించి అందని లోకాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం చెన్నై ఎంజీఎం ఆస్పత్రి నుంచి ఆయన నివాసానికి తీసుకెళ్లారు. రేపు సాయంత్రం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చెన్నైలోని ఆయన వ్యవసాయ ప్రాంతాన అంతిమ సంస్కారాలు జరుపుతామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక గాన గంధర్వుడు ఇక లేరని ఎన్నో మనసులు కన్నీటి హృదయాలతో మూగబోయి వీడ్కోలు తెలుపుతున్నారు.