NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

ఆ మాఫియా కి భయపడే వైసిపి లోనికి గంటా…?

తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు తెర లేపిన మాజీ టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసిపి ఎంట్రీ విషయం వెనుక చాలా పెద్ద కథ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన గంటా విశాఖలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలంగా విశాఖ జిల్లాలో మైనింగ్ వ్యవహారాల అవినీతి, అక్రమాలు మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేవలం విశాఖ అనే కాకుండా ఉత్తరాంధ్రలోని మైనింగ్ వ్యవహారాలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే కీలక సామాజికవర్గం ఉంది. దశాబ్దాల కాలంగా ఈ వర్గం మైనింగ్ వ్యవహారాలను తమ గుప్పిట్లో పెట్టుకుని వేల కోట్లు అర్జిస్తోంది.

 

Bank to hold auctions on Ganta Srinivas Rao's assets for bad debts ...

ఇక ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వ్యవహారాలకు గండిపడింది. దీనితో కొన్ని సంస్థలపై కోట్లకు కోట్లు పెనాల్టీలు పడ్డాయి. ఇప్పుడు గుక్కతిప్పుకోలేని సమస్యల్లో ఉన్న వారు తమకు అండగా ఉండేందుకు తమ వాడిని ఒకడిని అధికారపక్షం లోకి చేరిస్తే ఈ పరిస్థితి సద్దుమణుగుతుంది అని భావిస్తున్నారు. కనీసం మాట సాయం చేసే మనిషి కూడా లేకపోవడంతో ఇటువంటి లీడర్ ఆ పార్టీలో ఉంటే తమకు శ్రేయస్కరంగా ఉంటుంది అన్నది వారి భావన.

ఇకపోతే గంటా శ్రీనివాసరావు కి వివిధ వర్గాలతో అనేక వ్యాపార లావాదేవీలు ఉన్నాయన్నది రాజకీయ వర్గాల్లో తరచుగా వినిపిస్తూ ఉండే మాట. ఆయనకు ప్రత్యక్ష భాగస్వామ్యం లేకపోవచ్చు కానీ ఈ నెలలో జరిగిన విషయాలు మరియు జరుగుతున్న వాటికి కూడా ఆయన అండదండలు పూర్తిగా ఉంటాయి. అందుకే…. నాలుగేళ్ళు ప్రతిపక్షంలో ఉండి తన వాళ్లకు సహాయం చేయలేని స్థితిలో ఉండటం కన్నా వైకాపా లో కి వెళ్ళి ఎంతో కొంత సాయం అందించడం ద్వారా తర్వాత రాబోయే సమస్యల నుండి తనని తాను రక్షించుకోవడం ప్రస్తుతం గంట ముందు ఉన్న కర్తవ్యంగా తెలుస్తోంది.

అయితే ఇక్కడ విషయం ఏమిటంటే గంట పార్టీ మారినా…. అతని అనుచరగణం మొత్తం టిడిపిలోనే ఉండవచ్చు. ఇక ఇదంతా గమనించిన జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పార్టీలో గంటా ను చేర్చుకుంటేనే సదరు వ్యక్తులు లాభపడతారు లేదంటే వారితో పాటు గంటా కూడా భవిష్యత్తులో ఇబ్బంది పడవలసి వస్తుంది అని రాజకీయ విశ్లేషకుల పరిశీలన.

author avatar
arun kanna

Related posts

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju