Sreedevi Soda Center Glimpse: యంగ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం శ్రీదేవి సోడా సెంటర్ సినిమా లో నటిస్తున్నారు.. ఇటివల ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకర్షించింది.. మే 11న సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా శ్రీదేవి సోడా సెంటర్ ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు.. విడుదల చేసిన రెండు రోజుల్లోనే ఈ గ్లింప్స్ యూట్యూబ్ లో NO.1 స్థానంలో నిలిచి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది..

గ్లింప్స్ విడుదల చేసిన సుధీర్ బాబు.. “మరి అక్కడుంది లైటింగ్ సూరిబాబు కదా.. కొంచెం ఓల్టేజ్ ఎక్కువే ఉంటది..” అని కామెంట్ చేశారు. ఇందులో నదిలో ఏదో పడవ పందెం జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే పడవలో ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు హీరో. పనిలో పనిగా తన కండలు తిరిగిన బాడీ కూడా చూపించాడు. తిరుణాలలో హీరో సిగ్గు, ప్రేమ, ఫైటింగ్ అంతా చూపించారు.ఇందులో సిక్స్ ప్యాక్ బాడీ తో ఆకట్టుకున్నారు సుదీర్ బాబు. కానీ హీరోయిన్ మాత్రం ఎక్కడ చూపించలేదు. ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కుతోందని వీడియో ద్వారా చెప్పకనే చెప్పారు మేకర్స్. ఈ వీడియో విడుదలైన కాసేపట్లోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. మొత్తానికి రెండు రోజుల్లోనే లైటింగ్ సూరి బాబు తన హై ఓల్టేజ్ పెర్ఫార్మెన్స్ తో అందరిని ఆశ్చర్యానికి గురి చేసి యూట్యూబ్ లో NO.1 స్థానంలో నిలిచాడు..
https://youtu.be/l1UrqV0OcqU
పలాస 1978 సినిమాతో అరంగేట్రంలోనే మంచి పేరు సంపాదించుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 4 గా నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో లైటింగ్ మెన్ సూరి బాబు పాత్రలు సుధీర్ బాబు కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ , వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
Glimpse of our #LightingSooriBabu? Trending #1 on @YouTubeIndia ?
▶️ https://t.co/4Pmk4KTfrH
#SrideviSodaCenter#70mmSSC @isudheerbabu @70mmEntertains @VijayChilla @devireddyshashi @karunafilmmaker #ManiSharma @shamdat2 @sreekar_prasad @SabbaniRamakri1#StayHomeStaySafe pic.twitter.com/YpgeAGm34e— 70MM Entertainments (@70mmEntertains) May 12, 2021
YS Viveka Murder: వివేకా హత్యతో తన ప్రమేయం లేదంటున్న ఎర్ర గంగిరెడ్డి..!!