Sreekaram : టాలీవుడ్ హీరో శర్వానంద్.. ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం పరితపించే నటుడు..!! ఇమేజ్ చట్రంలో ఇరుక్కు పోకుండా పాత్ర కోసం ఏమైనా చేస్తాడు..!! తాజాగా శర్వానంద్ నటించిన చిత్రం శ్రీకారం విడుదలైంది..! మరి ఈ సినిమా గురించి అభిమానుల ఏమనుకుంటున్నారు..!! శ్రీకారం లో హైలెట్ సీన్ ఏంటి..? పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..!!
ఆడియన్స్ టాక్..!!
హీరో శర్వానంద్ ఇటీవల కాలంలో నటించిన ప్రతి సినిమా తో ఆయన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.. ఆధునిక వ్యవసాయం, యువత వ్యవసాయం లోకి రావడం వంటి బాధ్యతాయుతమైన సబ్జెక్టుతో శర్వానంద్ నటునతో ప్రేక్షకులను కట్టి పడేశాడు..!! సినిమా చాలా బాగుందని అభిమానులు అంటున్నారు.. ఇలాంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో మరిన్ని సినిమాలు రావాల్సిన అవసరం ఉందని ప్రేక్షకులు అన్నారు.. శర్వానంద్ ఇలాంటి కథలు ఎంపిక చేసుకున్నందుకు ఆయన ఖచ్చితంగా అభినందించాల్సిందేనని అభిమానులు మెచ్చుకుంటున్నారు..!! మొదటి భాగమంతా డీసెంట్ గా ఉందని.. ఇక రెండో భాగం అంతా భావోద్వేగ సన్నివేశాలతో కట్టిపడేస్తుంది అని చెబుతున్నారు..
ఈ హైలెట్ సీన్లు థియేటర్లో చూసి తీరాల్సిందే..!!
మురళి శర్మ, శర్వానంద్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి.. “ఉద్యోగం వస్తే అమ్మని బాగా చూసుకుందామని అనుకున్నానురా.. ఇప్పుడు ఉద్యోగం తప్ప ఇంకేం చూసుకో లేక పోతున్నాను” అంటూ మురళీశర్మ చెప్పే డైలాగ్ అందరికీ కనెక్ట్ అవుతుంది.. ఇంటర్వెల్ కు ముందు 30 నిమిషాలు వచ్చే సన్నివేశాలతో ప్రేక్షకులు కచ్చితంగా మాకు సినిమా కు కనెక్ట్ అయిపోతారని.. ఈ సీన్స్ ఖచ్చితంగా థియేటర్లో చూడాలని.. ఇలాంటి హైలెట్ సీన్స్ ఈ సినిమాలు చాలానే ఉన్నాయి.. వ్యవసాయం గురించి డిఫరెంట్ యాంగిల్ లో చెప్పడానికి శ్రీకారం చుట్టిన దర్శకుడు దానికి కొన్ని కమర్షియల్ హంగులు మేళవించి కంప్లీట్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాడు.. రావు రమేష్ నటన కూడా సినిమాకు మరో బలం అంటున్నారు.. మొత్తానికి ఈ సినిమా హిట్టు..!! బావోద్వేగ సన్నివేశాలతో అందరినీ కట్టిపడేస్తోంది అనడం ఖాయం..!
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!