Sreekaram : శర్వానంద్ హీరోగా 14 రీల్స్ ప్లస్ పతాకంపై నూతన దర్శకుడు కిషోర్ బి దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన చిత్రం శ్రీకారం..!! ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లోని పాటలకు, ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది..! భారీ అంచనాల తో మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది..! ఇదే రోజున వరుసగా నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి.. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత సాధించిందో.. క్లీన్ హిట్ కోసం ఎంత కావాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!
మార్చి 11న బాక్సాఫీస్ దగ్గర ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.. శర్వానంద్ నటించిన శ్రీకారం మూవీ బాక్సాఫీస్ వద్ద అన్ని సినిమాలలో కి హైయెస్ట్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకుంది..!! 17 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ తో దూసుకెళ్తోంది.. ఈ సినిమా మొత్తం బడ్జెట్ 17.5 కోట్లు కాగా.. 17 కోట్లు రిలీజ్ బిజినెస్ ద్వారా రాబట్టడం తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి హైప్ క్రియేట్ చేసింది..!!
వ్యవసాయం ప్రధానంగా తెరకెక్కిన శ్రీకారం సినిమా నైజాం ప్రాంతం లో ఏకంగా 205 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో 535 థియేటర్స్ లో రిలీజ్ అవ్వనుంది.. ఇక ఫస్ట్ డే ప్రిడిక్షన్స్ విషయాని కొస్తే శ్రీకారం 4 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు..