Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ టైంలో బాగా హైలెట్ అయిన వ్యక్తి సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్. ఆ టైం లో అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ తన గర్ల్ ఫ్రెండ్ సిరి పరిస్థితిని అర్థం చేసుకుని శ్రీ హాన్ చేసిన కామెంట్లకి బయట భారీ ఎత్తున పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక్కసారిగా మనోడి పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమ్రోగింది.
శ్రీహాన్ లాంటి అర్థం చేసుకునే వ్యక్తి ఒక అమ్మాయి జీవితం లో ఉంటే చాలు… అమ్మాయి జీవితం పంట పండినట్లే అని అప్పట్లో టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీహాన్ హిమాలయాల్లో సేదతీరుతూ సరికొత్త ఫోటోలు సోషల్ మీడియా లో ఆప్ లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం సిరికి పాజిటివ్ రావటంతో కొంతమంది అత్యుత్సాహం పరులు శ్రీహాన్ ఇటువంటి సమయంలో ఎందుకు..సిరికి దూరంగా ఉంటున్నాడు.. అనేదాని గురించి నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉన్నారు. మరోపక్క షణ్ముక్ కి దీప్తి బ్రేకప్ చెప్పటంతో పాటు…సిరి …శ్రీ హాన్ ఇప్పటివరకు కలిసి ఫోటోలు దిగిన పరిస్థితులు ఎక్కడా కనపడక పోవటంతో నెగిటివ్ ప్రచారం బయట కొనసాగుతోంది.
అయితే ఈ తరుణంలో ఇటీవల షణ్ముక్ గురించి సోషల్ మీడియాలో .. ఓ నెటిజన్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత.. శ్రీహాన్ నీ ప్రశ్నించినట్లు వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షణ్ముఖ మీద బిగ్బాస్ అయిపోయిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అండి.. ప్రశ్నించగా అంతకు ముందు అతడు నాకు ఫ్రెండ్ ఆ తర్వాత కూడా ఫ్రెండే..అని శ్రీ హాన్ ఏ మాత్రం తడబడకుండా చెప్పటం జరిగిందట. దీంతో నెగిటివ్ మైండ్ అనేది శ్రీహాన్ కి లేదని నిజంగా సిరి బాయ్ ఫ్రెండ్ బంగారం అంటూ తాజా వార్త పై సోషల్ మీడియాలో జనాలు రియాక్ట్ అవుతున్నారు.