తెలుగు ‘బిగ్ బాస్ సీజన్ 4’ ప్రస్తుతం రికార్డు స్థాయి రేటింగ్ లను దక్కించుకుంటోంది. షో కి ముందే భారీ రేటింగ్స్ ను ఊహించిన ‘స్టార్ మా’ తాజా రేటింగ్స్ తో సంతృప్తి చెందుతూ ఉండగా ఈ విషయంలో మరికొంత దూకుడు ప్రదర్శించేందుకు సిద్ధమయింది. మొదటి రోజు కంటెస్టెంట్స్ పరిచయం ఎపిసోడ్ తోనే భారీ టీఆర్పీ సంపాదించిన వారు ఆ తర్వాత ఎపిసోడ్స్ విషయంలో కొద్దిగా తగ్గారు.
అయితే వారు చూపించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ…. అదరగొట్టే డాన్సులు వేసిన కంటెస్టెంట్స్ దెబ్బకు ఒకసారి మళ్ళీ రేటింహ్గ్ ఊపు అందుకుంది. అఖిల్-మోనాల్-అభిజిత్ మధ్య కలిపిన పులిహోర అంత పెద్దగా ప్రయోజనం కలిగించలేదు కానీ ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో పాటు నిన్న వేసిన డాన్స్ లు దెబ్బకు ఒక్కసారిగా రేటింగ్ పిక్స్ కు వెళ్లిపోయింది. మొదటివారం ఓవరాల్ గా ఈ సీజన్ కు 18.5 రేటింగ్ వచ్చింది.
సాధారణంగా ఇది చాలా మంచి రేటింగ్…. కానీ గత సీజన్ లతో పోలిస్తే రానున్న రోజుల్లో మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్నో నెలలుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ వస్తున్న వంటలక్క సీరియల్ ‘కార్తీకదీపం’ ను బిగ్ బాస్ అధిగమించలేకపోయింది. అయితే పోయేదేముంది… రెండూ ‘స్టార్ మా’ వే కదా. ఈ వారం కూడా వంటలక్క సీరియల్ ఎప్పటి లాగే రికార్డు స్థాయి టిఆర్పి రేటింగ్ దక్కించుకుంది.
మొదటి వారంలో కంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఈ వారం రాబోతోందని… రేటింగ్ డబుల్ అయిపోయిందని… ఇకపోతే ఆ పులిహోర ఎపిసోడ్ లేకుండా ఉంటే ఎవరికీ అందనంత ఎత్తుకు షో వెళ్లిపోయేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మరొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ముక్కు అవినాష్ రూపంలో మరొక అస్త్రం రెడీగా ఉంది కాబట్టి ‘స్టార్ మా’ రూపొందించబోతున్న డ్రామాలు , టాస్క్ లు కేవలంవైల్డ్ కార్డ్ ఎంట్రీ లో ఎంటర్టైనర్స్ నే టార్గెట్ చేస్తూ చేస్తున్నారని చెబుతున్నారు. అది కనుక క్లిక్ అయితే స్టార్ మా స్థాయి మరింత పెరిగి ఇక ఎవరూ టచ్ చేయలేని రేంజ్ కు వెళ్లిపోతుంది.