Mandhuloda Step: టాలెంటెడ్ యంగ్ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకోవడం తో పాటు యూట్యూబ్ లో #1 గా నిలిచింది.. ఇటీవల ఈ చిత్రం నుండి “మందులోడ” సాంగ్ ను విడుదల చేయగా యూట్యూబ్ లో ట్రెండ్ అవడటంతో పాటు 2.3 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.. తాజాగా ఈ పాటలోని “మందులోడ” స్టెప్ ను వేస్తే 1,50,000 నజరానా ఇవ్వనున్నట్లు ప్రకటించారు మేకర్స్..!!

మందులోడా పాట లోని ఏదైనా మ్యూజిక్ పెట్టి తీసుకొని 20 సెకండ్ల కు తగ్గకుండా కంపోజ్ చేసిన వీడియో ను #MandhulodaStepChallenge ,#srideviSodaCenter, #SSC కి ట్యాగ్ చేసి మీ వీడియోను పంపించాలి ప్రతిరోజు ముగ్గురు లక్కీ విన్నర్ లకు రూ.50000 ఇస్తారు. ఇలా జులై 21 నుంచి 26 వరకు మొత్తం ఆరు రోజులు 1,50,000 ఇవ్వనున్నారు నిర్మాతలు.. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సాంగ్ లోని ఒక చిన్న బిట్ కు డాన్స్ చేసి పంపించండి. లక్కీ విన్నర్స్ మీరే కావచ్చు..
Compose, share & win Rs. 1,50,000/-*
Dance to any music bit of #Mandhuloda song. (20sec max)
Upload your videos using #MandhulodaStepChallenge#SrideviSodaCenter #SSC & tag @70mmEntertains
Every day 3 lucky participants can win 5000/-* each from July 21st – 26th pic.twitter.com/BI4NPLAh6I
— 70MM Entertainments (@70mmEntertains) July 18, 2021
ఈ చిత్రాన్ని కరుణాకర్ దర్శకత్వంలో 70MM బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో లైటింగ్ సూరిబాబు గా సిక్స్ ప్యాక్ బాడీతో అలరించాడు సుధీర్.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను జీ నెట్వర్క్ కొనుగోలు చేసింది. జి నెట్వర్క్ ఈ రైట్స్ కోసం ఏకంగా రూ.9 కోట్లను చెల్లించింది.. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు మేకర్స్..