ట్రెండింగ్ న్యూస్

సుధీర్ నన్ను చాలా సార్లు ట్రై చేశాడు అని చెప్పి బాంబు పేల్చిన రష్మి..! కోప్పడిన సుధీర్

Share

సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి తెలుగు బుల్లితెరపై హిట్ పెయిర్. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరి పేరు తెలియని వారు ఉండరు. ఈ జంట విడివిడిగా కన్నా కూడా జంటగానే బాగా ఫేమస్. ఎన్నో ఏళ్ల నుండి వీరి మధ్య ప్రేమాయణం సాగుతోందని పెళ్లి కూడా చేసుకుంటారు అని ప్రచారం జరుగుతోంది. దీనిని వారు ఎన్నోసార్లు ఖండించారు కానీ ఫలితం లేకుండా పోయింది. 

 

Clash Between Sudheer and Rashmi - Dhee Jodi Latest Promo - Dhee 11 - 10th  April 2019 - YouTube

ఇక జబర్దస్త్ షో లో, ఢీ షో లో అయితే వీరిద్దరి మధ్య రొమాన్స్, డ్యాన్స్, సెటైర్లకు అసలు హద్దు అనేది ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో సుడిగాలి సుధీర్ తో పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసింది రష్మి. నాకోసం సుధీర్ చాలాసార్లు ట్రై చేశాడు అని పెద్ద బాంబు పేల్చింది. 

వివరాల్లోకి వెళితే…. రష్మీ-సుధీర్ ఇద్దరూ చాలా తక్కువ స్థాయి నుండి పైకి వచ్చారు. సినిమాల్లో అతి చిన్న వేషాలు చేసుకుంటూ టీవీ షోలలో అసలు గుర్తింపులేకుండా తమ ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు టాప్ యాంకర్స్ గా ఎదిగారు. ఈక్రమంలోనే సినిమా ఛాన్సులు కూడా పట్టేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమించుకున్నట్లు ఎప్పటినుండో ప్రచారం సాగుతోంది. దీంతో ఈ జంట విపరీతంగా ఫేమస్ అయింది. సుధీర్ పెళ్లి గురించి తాజాగా కొన్ని కామెంట్స్ చేసింది రష్మి.

రష్మి తో వివాహంపై సుధీర్ కు ఎప్పుడూ ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉంది అంటూ ఆ జంట ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. ఇక తాజాగా విడుదల చేసిన జబర్దస్త్ ప్రోమో లో రష్మి సుధీర్ మధ్య ఒక ఇంటరాక్షన్ జరిగింది.

స్కిట్ లో భాగంగా…. సుధీర్…. “యాంకర్ రష్మి గౌతమ్ ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను…. ఈ గారడీ రష్మీ ను ఇచ్చి పెళ్లి చేస్తావేంట్రా” అని కోపంగా డైలాగ్ చెబుతాడు. ఆ వెంటనే రేష్మి –  “పర్లేదులే సుధీర్ ఎన్నెన్నో అనుకుంటాం…. అన్నీ జరుగుతాయా ఏంటి నన్ను పెళ్లి చేసుకుందామని ఎన్నిసార్లు ట్రై చేసావు…. ఆఖరికి దీని పెళ్లి చేసుకున్నావా? ” అని చెప్పడంతో అందరూ ముందు షాక్ అయ్యారు. తర్వాత నవ్వేశారు.


Share

Related posts

హీరో సూర్య పొలిటికల్ ఎంట్రీ.. అసలు నిజమేమిటంటే?

Teja

Samantha: విడాకుల విషయంలో సమంతాకి సపోర్ట్ గా నిలిచిన బిగ్ బాస్ బ్యూటీ..!!

sekhar

ఆ నిర్మాత లేకపోతే చిరంజీవి మెగాస్టార్ అయ్యేవారు కాదా ..?

GRK