వర్షాకాలంలో జలుబుతో బాధపడుతున్నారా…. అయితే ఇంట్లోనే ఈ చిట్కాలు పాటించండి!

మానవులలో వచ్చే అత్యంత సాధారణ అంటువ్యాధి జలుబు. వర్షాకాలం, చలికాలంలో మరీ ఎక్కువగా ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు వర్షంలో తడవడం వల్ల కూడా సాధారణ జలుబు మనల్ని చికాకు పెడుతుంటుంది. జలుబు సీజన్ మారినప్పుడు వచ్చే సాధారణ అంటువ్యాధి , అయిన దాంతోపాటు తలనొప్పి, దగ్గు ,అమ్మోనియా ,వంటి అనారోగ్య సమస్యలు మనల్ని బాధిస్తాయి .జలుబు, శ్వాస వ్యవస్థను ప్రభావితం చేసే వైరస్ సంక్రమిత వ్యాధి . దీనికి కారణం అయ్యే వైరస్ “రైనో వైరస్” ఇది తుమ్ములు ,దగ్గు ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది.

సాధారణ జలుబు 50శాతం రైనో వైరస్ వల్ల సంక్రమించిన, ఇది ప్రమాదకరం కానప్పటికీ దీర్ఘకాలంపాటు ఉంటూ ,అంటే దాదాపు 10 నుంచి మూడు వారాల పాటు జలుబు మనల్ని బాధిస్తుంది. జలుబు మరీ ఎక్కువైతే జ్వరం కూడా వస్తుంది. అయితే కంగారు పడాల్సిన పనిలేదు,ఈ జలుబు సమస్యను ఈ చిట్కాలను ఉపయోగించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం….

జలుబు చేసినప్పుడు ప్రతి రోజు వేడి చేసిన నీటిని తాగితే జలుబు నుంచి కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా వేడి నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకుని రోజుకు మూడు సార్లు పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒక స్పూన్ తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని వేసుకుని తాగితే జలుబు ,దగ్గు నుంచి కొద్దిగా ఉపశమనం పొందవచ్చు. జలుబు, తుమ్ములు మరీ ఎక్కువగా ఉంటే నీటిని బాగా మరగనిచ్చి అందులో కొద్దిగా పసుపు వేసి రోజుకు రెండుసార్లు ఆవిరిపడితే ఉపశమనం లభిస్తుందని కొందరు వైద్యులు సూచిస్తున్నారు, అదేవిధంగా వెల్లుల్లి ముక్కలను మెత్తగా నూరి దాని వాసన గంటకు ఒకసారి పిలిస్తే మంచి ఫలితం ఉంటుంది.

మరీ ముఖ్యంగా జలుబు చేసినప్పుడు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం, విశ్రాంతి తీసుకోవడం వల్ల శారీరకంగానూ, మానసికంగాను ఒత్తిడి తగ్గి జలుబు తొందరగా తగ్గడానికి అవకాశం ఉంది. జలుబు చేసినప్పుడు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం,జలుబు మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జలుబు నుంచి తొందరగా కోలుకో వచ్చు.