Family Drama: కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సుహస్.. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు.. ఇప్పుడు అదే జోష్ లో వరుస సినిమా లలో నటిస్తున్నాడు.. సుహస్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఫ్యామిలీ డ్రామా.. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయగా టైటిల్ కి భిన్నంగా పోస్టర్ ఉండటంతో సినిమా పై ఆసక్తిని కలిగించింది.. తాజాగా ఫ్యామిలీ డ్రామా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్..!!

తాజాగా విడుదలైన ట్రైలర్ లో సుహస్ సైకో సీరియల్ కిల్లర్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో తేజ,సంజయ్, పూజా కిరణ్, అనూష, శ్రుతి నటిస్తున్నారు. తండ్రి వల్ల ఇబ్బందులు పడుతున్న ఇంట్లోకి సుహస్ సహాయం చేయడానికి వచ్చి వారినే భయపెట్టడం ట్రైలర్ లో చూడొచ్చు. ఇప్పటి వరకు న్యాచురల్ పాత్రలలో కనిపించిన సుహస్ ఇందులో డిఫరెంట్ గా సైకో కిల్లర్ గా నటిస్తు అందరినీ భయపెడుతున్నాడు.సైకో క్రైమ్ థ్రిల్లర్ గా, రూపొందుతున్న ఈ సినిమాతో మోహర్ తేజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఛష్మా ఫిలిమ్స్, భారతి ఫిలిమ్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ల పై తేజ కాసరపు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామకృష్ణ ఎడిటింగ్ వర్క్ చేయగా, వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.ఈ సినిమా కు అజయ్ అండ్ సంజయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.