Suhasini: సుహాసిని ఈ పేరు గురించి ఘనంగా పరిచయం అక్కర్లేదు.. విభిన్నమైన క్యారెక్టర్స్ ని చేస్తూ తను నటించిన ప్రతి సినిమాలో తన క్యారెక్టర్ ద్వారా ఎంతోకొంత మెసేజ్ ని అందిస్తుంది.. ఛాలెంజింగ్ రోల్స్ కు సుహాసిని పెట్టింది పేరు.. అదే నమ్మకాన్ని మరోసారి నిరూపించేందుకు “బలమెవ్వడు” చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు..!!
ధ్రువన్ కటకం, నియా త్రీపాఠీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బలమెవ్వడు..!! వైద్య రంగంలోని దోపిడీని తెలియజేసే నేపథ్యంలో లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సత్య రాచకొండ.. ఈ సినిమాను ఆర్ బి మార్కండేయులు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మెడికల్ మాఫియా కు వ్యతిరేకంగా పోరాడే నిజాయితీగల డాక్టర్ పాత్రలో సుహాసిని నటిస్తున్నారు.. సుహాసిని ఏ సినిమాలో నటించిన ఆ సినిమాకు వన్నె తెస్తుంది. కచ్చితంగా ఈ సినిమాలో కూడా సుహాసిని మంచి మెసేజ్ తో పాటు మంచి గుర్తింపు కూడా సొంతం చేసుకుంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో సుహాసిని పాత్ర హైలెట్ గా నిలుస్తుందని అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ కాన్సెప్ట్స్ టీజర్‌కు విశేష స్పందన లభించింది. ఈ సినిమాకు మణిశర్మ మెలోడీలు అందిస్తున్నారు.