Sukumar : ప్రముఖ దర్శకుడు సుకుమార్.. పరిచయం అవసరం లేని పేరు.. టాలీవుడ్ లో ప్రస్తుతం సుకుమార్ శిష్యుల హవా నడుస్తోంది.. ఆయన వద్ద స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేసిన హరిప్రసాద్ జక్క దర్శకత్వం వహించిన చిత్రం ప్లే బ్యాక్.. ఇటీవల ఈ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది..! తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది యూనిట్..! ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు..!!
ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ.. హరిప్రసాద్, ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన అనన్య లను ప్రశంసించాడు సుక్కు.. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి కి చాన్స్ ఇవ్వడం అభినందించాల్సిన విషయం అన్నారు. టాలీవుడ్ లో తెలుగు వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తాను కూడా ఆ పని చేస్తున్నానని చెప్పారు. తన చిత్రాలలో ప్రధాన పాత్రలకు తెలుగు వారినే ఎంపిక చేసుకుంటానని చెప్పారు సుకుమార్. తన రాబోయే చిత్రాల్లో తెలుగు వారికి అవకాశాలు కొనసాగుతాయని ప్రకటించారు సుకుమార్. తన నెక్స్ట్ మూవీ లో తెలుగు అమ్మాయి కి హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని ప్రామిస్ చేశారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!