యాంకర్ సుమ.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెర మహానటి సుమ. గత ముప్పై ఏళ్లుగా అద్భుతమైన నటిస్తూ.. యాంకరింగ్ చేస్తూ కొనసాగుతుంది. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా నటించిన ఈమెకు పెద్ద గుర్తింపు రాలేదు. ఆతర్వాత హీరోయిన్ అనే విషయాన్నీ పక్కన పెట్టి బుల్లితెరపై యాంకరింగ్ ప్రారంభించింది. అంతే దశ తీరిపోయింది.
తెలుగు బుల్లితెరపై సీనియర్ యాంకర్ సుమ. ఎన్నో ఏళ్లగా నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్న ఈ యాంకర్ ఎవరితో అయినా సరే కలిసిపోతుంది. అందరిని నవ్వుతు మాట్లాడిస్తూ మనసు దోచిస్తుంది. యాంకర్ వయసు అయిపోయిన సరే ఎంతో అందంగా కనిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరగా ఉంది సుమ కనకాల.
అయితే ఈమె తన వద్ద పని చేసేవారిని సొంత మనుషుల్లా చూసుకుంటుందని ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. అలా చూసుకుంటున్నందుకే ఆమె వద్ద కొందరు 20 ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. ఇక ఈ విషయంకు సంబంధించిన ఓ వీడియోను సుమ తీసి నెట్టింట్లో పోస్ట్ చేసింది. ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది.
అందులో ఏముందంటే తన టీం వారిని ఎప్పటి నుంచి పని చేస్తున్నారు అని అడుగుతూ వచ్చింది. ఒకరు 20 ఏళ్ల నుంచి పని చేస్తున్న అని చెప్పగా మరొకరు 15 ఏళ్లు మరొకరు 5 ఏళ్ళు అని చెప్పారు. ఇక ఆమె మాట్లాడుతూ నేను 30 ఇయర్స్ ఇండస్ట్రీ.. మీ అందరికంటే సీనియర్ అంటూ సరదాగా చెప్పుకొచ్చింది.అందరిని నవ్వించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
https://www.instagram.com/p/CFtqK6OJYgi/?utm_source=ig_web_copy_link