22.7 C
Hyderabad
March 24, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Sumalatha: బిజేపిలో చేరిక పై క్లారిటీ ఇచ్చిన సుమలత..

sumalatha clarity BJP joining
Share

Sumalatha:  టాలీవుడ్ సీనియర్ నటి, మాండ్యా ఎంపీ సుమలత బీజేపీలో చేరనున్నట్టు కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా మీడియా సమావేశం నిర్వహించి, బీజేపీలో చేరడంపై సుమలత ఓ ప్రకటన చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే మీడియా సమావేశం నిర్వహించారు. తను ఇప్పుడే బీజేపీలో చేరబోవడంలేదని స్పష్టం చేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు.

sumalatha clarity BJP joining
sumalatha clarity BJP joining

కేంద్రంలో ఉన్న బీజేపీకి తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని మీడియా ముఖంగా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల తనకు విశ్వాసం ఉందని, సన్నిహితులు, మద్దతుదారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నానని సుమలత తెలిపారు.

మోదీ నాయకత్వంలో బీజేపీ స్థిరంగా అభివృద్ధి పథంలో పయనిస్తోందని, ప్రపంచ దేశాల మధ్య భారత్ పలుకుబడి పెరగడం వంటి కారణాలు తనను బీజేపీ దిశగా నడిపించాయని అన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలన్న నిర్ణయం తన కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్నది కాదని ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం తన కొడుకు రాజకీయాల్లోకి రాడని ఆమె తేల్చి చెప్పారు.

మాండ్యా జిల్లాలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే తన లక్ష్యం అని అన్నారు. తనకు డబ్బు, పేరు ప్రతిష్ఠలతో పనిలేదని, వాటి కోసమే అయితే తాను రాజకీయాల్లోకి రావాల్సిన పనిలేదని, తనకు కావాల్సినంత డబ్బు, పేరు వున్నాయని గుర్తు చేశారు.

జిల్లాలోని కొందరు నేతల నుంచి తనకు అవమానాలు ఎదురయ్యాయని, అయితే అభివృద్ధి కార్యక్రమాలు, బహిరంగ సభలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు బీజేపీ అండ అవసరం అని భావించినట్టు సుమలత తెలిపారు. అదేవిధంగా సుమలత బిజేపి చేరనున్నాని తెలిపింది. అయితే ఇప్పుడు కాదని అన్నారు.


Share

Related posts

నీతి అయోగ్ సమావేశానికి వెళితే పోను రాను ఖర్చులు దండగ తప్ప వచ్చేది ఏమి ఉండదు.. అందుకే బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్న తెలంగాణ సీఎం కెసిఆర్

somaraju sharma

Green Peas: పచ్చి బఠాణి నీ స్కిప్ చేస్తే.. ఇవి మిస్స్ అవుతారు..!?

bharani jella

ఈ దెబ్బతో రష్మిక కి టాలీవుడ్ లో నంబర్ వన్ పొజిషన్ గ్యారెంటీ .. కారణం వాళ్ళే ..?

GRK