SuperMario Game: సూపర్ మారియో గురించి గేమింగ్ ప్రియులకు తెలిసే ఉంటుంది ఇది ఒక ట్రెండ్ సెట్టర్.. 1982 నుంచి 1992 వరకు చాలా మంది ఇష్టపడే గేమ్ ఇది.. ఒక దశాబ్దం పాటు బెస్ట్ సెల్లర్ వీడియో గేమ్ ఇదే.. అటువంటి సూపర్ మారియో మన బ్రహ్మానందం వెర్షన్ లో చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

సూపర్ మారియో మన హాస్య బ్రహ్మానందం వెర్షన్ లో ఉంటుందో చూపించేలా ఈ వీడియో ను తయారు చేశారు. ఈ గేమ్ కి కొన్ని ఫన్నీ మీమ్స్ జోడించి,బ్రహ్మానందం నటించిన ఫేమస్ సినిమాల లోని డైలాగ్స్ తీసుకొని ఈ వీడియోను ఎడిటింగ్ రూపొందించారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.. సాధారణంగా బ్రహ్మానందం మీమ్స్ తో చేసిన ఏదైనా ఫొటో వీడియో, వైరల్ అవుతుంది.. అటువంటిది ఏకంగా సూపర్ మారియో గేమ్ ను బ్రహ్మానందం వెర్షన్ అంటే ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ వీడియో మీకోసం.. ఒకసారి వీక్షించండి..