టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షుడు అజారుద్దీన్ కు సుప్రీం కోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఆయన నేతృత్వంలోని హెచ్‌సీఏ ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. అసోసియేషన్ వ్యవహారాల పర్యవేక్షణకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు సారథ్యంలో ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఆయన నివేదిక ప్రకారం తదుపరి ఆదేశాలు ఇస్తామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

గతంలో జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ నేతృత్వంలో ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీని ధర్మాసనం రద్దు చేసింది. హెచ్‌సీఏ తదుపరి కార్యచరణ, కమిటీల ఏర్పాటు, నిధుల ఖర్చు వంటి అన్ని అంశాలపై ఏకసభ్య కమిటీనే నిర్ణయం తీసుకుంటుందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ అరవింద్ కుమార్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేసింది.
గత కొన్నాళ్లుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. పాలకవర్గంలో లుకలుకలు, ఆర్దిక అవకతవకలు మ్యాచ్ ల నిర్వహణలో అక్రమాలు, అవినీతి.. ఇలా అనేక అంశాలకు హెచ్‌సీఏ వేదికగా మారింది. అటు, దేశ వాళీల్లో హైదరాబాద్ క్రికెట్ జట్టు ప్రదర్శన నానాటికీ తీసికట్టు అన్న చందంగా తయారైంది.
చంద్రబాబుకు షాక్ ఇస్తూ సంచలన కామెంట్స్ చేసిన మాజీ ఎమ్మెల్యే.. టీడీపీకి రాజీనామా