NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Star Anise: అనాస పువ్వు గురించి ఎవరికీ తెలియని వాస్తవాలు..!!

Star Anise: మసాలా దినుసులు ఈ పేరు చెప్పగానే నోరూరిపోతుంది కదూ.. ఇవి రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయి.. మసాలా దినుసులలో అనాస పువ్వు కూడా ఒకటి.. ఇది చూడడానికి నక్షత్ర ఆకారంలో ఉండి అందరినీ ఆకర్షిస్తుంది.. అనాస పువ్వు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం..!!

Surprising Benefits of Star Anise:
Surprising Benefits of Star Anise

Star Anise: అనాస పువ్వు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!

అనాస పువ్వు లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే శరీరం లోని ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. ఇంకా ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరం లోకి అనేక బ్యాక్టీరియా, వైరస్ రాకుండా చేస్తాయి. ఆస్తమా, బ్రాంకైటిస్ సమస్యలను నివారిస్తుంది. అన్ని రకాల శ్వాసకోశ సమస్య లను రాకుండా అడ్డుకుంటుంది.

Surprising Benefits of Star Anise:
Surprising Benefits of Star Anise

ఈ పువ్వు చక్కటి సువాసన కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ ఉన్నాయి. ఈ పువ్వు చక్కటి పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ పువ్వు లో సెడేటివ్ గుణాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వలన శరీరం లోని నాడులు ప్రశాంతంగా ఉంటాయి. చక్కటి నిద్ర పడుతుంది. ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాస్ నీటిలో అనాస పువ్వు వేసి ఆ నీటిని మరిగించాలి . ఈ కషాయం తాగితే హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్య నుంచి బయట పడతారు.

Surprising Benefits of Star Anise:
Surprising Benefits of Star Anise

గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్య లతో బాధపడుతున్నవారు ఈ పువ్వు ను తింటే వెంటనే తగ్గుతుంది. తిన్న ఆహారం అరగక ఇబ్బంది పడుతున్న వారు ఈ పువ్వు ను నమిలితే ఉపయోగం ఉంటుంది. అనాస పువ్వులను పొడిగా చేసి ప్రతిరోజు తీసుకుంటే స్త్రీ పురుషులలో హార్మోన్ సమస్యలు తగ్గుతాయి. సామర్థ్యం పెరుగుతుంది. సంతానోత్పత్తి సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ పువ్వు చక్కగా పనిచేస్తుంది.

Surprising Benefits of Star Anise:
Surprising Benefits of Star Anise

అనాస పువ్వు ను పొడిగా చేసుకుని ఈ పొడిలో కొద్దిగా నీటిని కలిపి ఇన్ఫెక్షన్ ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గి పోతుంది. ముఖం పై ఉన్న ముడతలు, మచ్చలు కూడా పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మార్కెట్లో లో అనాస పువ్వు ఎసెన్షియల్ ఆయిల్ దొరుకుతుంది. దీన్ని రాసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఈ నూనె ను జుట్టు కుదుళ్లకు పట్టిస్తే అంతే జుట్టు ఊడటం ఆగి ఒత్తుగా బలంగా పెరుగుతుంది ఈ నూనె ను నొప్పులు ఉన్నచోట రాస్తే ఫలితం కనిపిస్తుంది. వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, వాపులు ఉన్నవారు ప్రతిరోజు ఈ నూనె రాసుకుని కాసేపు మర్దన చేసుకుంటే నొప్పులు నుంచి ఉపశమనం కలుగుతుంది.

author avatar
bharani jella

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju