Sweaty Hands: చాలా మందికి అరచేతులు తరచుగా చెమట పడుతూ ఉంటాయి.. చల్లని వాతావరణంలో కూడా కొందరిలో అరచేతులకు చెమట పట్టడం మనం గమనిస్తూనే ఉంటాం.. ఇలా ఎందుకు జరుగుతుందంటే..!? అరచేతుల్లో చెమటలు పడితే ఏ వ్యాధులకు సంకేతం..!? తరచుగా ఈ సమస్య వేధిస్తుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!? వంటి విషయాలను ఇప్పుడు చూద్దాం..!!
సాధారణం గా మన చేతులను చూసి మన ఆరోగ్యానికి చెప్పవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చేతుల రంగు, చర్మం తీరును బట్టి కొన్ని వ్యాధులను అంచనా వేయచ్చు. అరచేతులు తరచుగా చెమటలు పడితే రెండు రకాల కారణాలు ఉన్నాయి. మొదటిది ప్రైమరీ హైపర్ హైడ్రోసిస్, రెండవది సెకండరీ హైపర్ హైడ్రోసిస్. ప్రైమరీ హైపర్ హైడ్రోసిస్ అనేది సహజం. ఇది అందరిలోనూ కనిపిస్తుంటుంది. చిన్నప్పటి నుంచి జన్యుపరంగా వస్తుంది. సీజన్స్ మారినపుడు, పర్యావరణం వలన కూడా వస్తుంది. ఇంకా కోపం, టెన్షన్, ఒత్తిడి కారణంగా చెమటలు పడుతుంటాయి. ఇవి మామూలే. చేతులు వణికే వారి లో కూడా చేతులు చెమటలు పడతాయి. స్త్రీలలో పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి, నీరసంగా సహజంగానే చేతులు చెమటలు పడతాయి.
సెకండరీ హైపర్ హైడ్రోసిస్ అనేది రోగాలకు సంకేతం. థైరాయిడ్ హార్మోన్ లోపం ఉన్నవారి లో ఈ సమస్య వస్తుంది. మధుమేహం వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి. అందువలన తరుచుగా అరచేతులు తరచూ చెమటలు పడుతుంటే వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సాధారణంగా పడుతుంటే మాత్రం యాంటీ పెర్స్పిరెంట్ క్రీమ్ దొరుకుతుంది. దీన్ని చేతులకు రాసుకుంటే చెమట పట్టకుండా చేస్తుందని వైద్యుల చెబుతున్నారు.