Digestive System: మీరు తిన్న ఆహారం జీర్ణం కాలేదని సూచించే సంకేతాలివే.. తెలుసుకోకపోతే ప్రమాదమే..

Share

Digestive System: మనం తిన్న ఆహారం సరిగా జీర్ణమైతే ఆరోగ్యంగా ఉంటాము.. అదే మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.. తినే ఆహారాలను జీర్ణం చేయడంతో పాటు వాటిలో ఉండే పోషకాలను మన శరీరానికి అందేలా చూడటం లో జీర్ణవ్యవస్థ పాత్ర చాలా కీలకమైంది. అయితే జీర్ణవ్యవస్థ పనితీరు సరిగా లేకపోతే గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి, అజీర్తి, వాంతులు, విరోచనాలు సమస్యలు వస్తుంటాయి.. ఒక్కటేమిటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి.. మనం తీసుకునే ఆహారం తరచుగా జీర్ణం కాకపోతే ముందుగానే తెలుసుకోగలిగితే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు..!! జీర్ణక్రియ సరిగా జరగకపోతే శరీరం మనకు ముందుగానే కొన్ని సంకేతాలను చూపుతుంది..!! వాటిని తెలుసుకొని తెలుసుకుంటే ఈ సమస్యను ఆదిలోనే అంతం చేయవచ్చు..!! తిన్న ఆహారం జీర్ణం కాకపోతే మరి శరీరం ముందుగానే సూచించే సంకేతాలు ఏంటో తెలుసుకుందాం..!!

Symptoms of food Not Digestive System: taken
Symptoms of food Not Digestive System: taken

తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం ప్రధాన కారణం ఎక్కువగా కొవ్వు భాగాలు శరీరంలోకి చేరడమే.. దీని వలన మలబద్దకం సమస్య వస్తుంది.. మలబద్ధకం అనేది సర్వసాధారణమైనది. తరచుగా మిమ్మల్ని మలబద్ధకం సమస్య వేధిస్తుంటే అది జీర్ణక్రియ వ్యవస్థ సరిగా బాగోలేదని అర్థం చేసుకోవాలి.. కంటి కింద నల్లటి వలయాలు కూడా ఈ సమస్యకు మరో కారణం.. మీ జీర్ణక్రియ సరిగా జరగట్లేదు అని సూచించడానికి కంటి కింద నల్లటి వలయాలు కూడా ఒక సంకేతం. మాంసం ఆహారాలు జీర్ణం కాలేదని ఇది సూచిస్తుంది.. మీకు అధిక రక్తపోటు ఉంటే జీర్ణ సమస్యలు ఉన్నాయని సూచన. మీ శరీరంలో సోడియం మొత్తం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియకు సహాయం చేసే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోండి. సోడియం తక్కువగా ఉండే ఆహార పదార్థాలను మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి.

Symptoms of food Not Digestive System: taken
Symptoms of food Not Digestive System: taken

శరీరం, నోటినుండి దుర్వాసన వస్తుంటే మీ జీర్ణక్రియ సరిగా జరగడం లేదని అర్థం. జీర్ణవ్యవస్థకు చర్మానికి దగ్గరి పోలిక ఉంది. అందువలన ఈ రకమైన సమస్యలు వస్తాయి. నోటి శరీర దుర్వాసనకు వస్తుంటె జీర్ణవ్యవస్థ బాగోలేదని గుర్తించాలి. జీర్ణ వ్యవస్థ బాగోలేదు అనడానికి రోగనిరోధక శక్తి తగ్గడం కూడా ఒక కారణం. ఎందుకంటే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం తో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ గా ఉన్నప్పుడు మాంసం ఆహారపదార్ధాలు తినకపోవడమే మంచిది. ముఖ్యంగా కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, వికారం గా ఉంటే మాత్రం జీర్ణ వ్యవస్థ సరిగా లేదని సంకేతం. తరచుగా మిమ్మల్ని కడుపు నొప్పి లేదా కడుపు సంబంధిత సమస్యలు వెంటాడుతుంటే అది జీర్ణ సమస్యలను కలిగిస్తుందని అర్థం చేసుకోవాలి. అధికంగా అలసటగా అనిపించినా కూడా దీనికి మరో కారణం.. ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలలో ఎక్కువ రోజులు గా మిమ్మల్ని వేధిస్తూ ఉంటే అవి కచ్చితంగా జీర్ణ సమస్యలు లేని గుర్తించాలి. మీరు తినే డైట్ ను మార్చుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. సమస్య మరీ జటిలంగా ఉంటే డాక్టర్ను సంప్రదించి తగిన సలహాలు సూచనలు పాటించాలి.


Share

Related posts

బ్రేకింగ్ : మందుబాబులకి సూపర్ గుడ్ న్యూస్

siddhu

బీచ్ లో హాట్ ఫోటోలతో మతి పోగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ!

Teja

Pooja Hegde Latest Photos

Gallery Desk