Kidney: కనిపించని జబ్బు.. లక్షణాలు ఇవే.. ముందుగానే తెలుసుకోకపోతే..

Share

Kidney: మన దేశంలో కిడ్నీ జబ్బులు ఎక్కువ.. అత్యాధునిక వైద్య పద్ధతులు ఎన్ని వచ్చిన ఆందోళన కలిగించే వ్యాధులు కొన్ని ఉన్నాయి.. వాటిలో కిడ్నీ సమస్య ఒకటి.. కిడ్నీ వ్యాధులకు అనేక కారణాలు ఉన్నాయి.. ముఖ్యంగా జీవన విధానంలో మార్పులు, గాలి, నీరు కాలుష్యం, నొప్పులు మాత్రలు ఎక్కువగా వాడటం.. శరీరంలో మిగతా అవయవాల పనితీరు మందగించినప్పుడు ఆ ప్రభావం కిడ్నీ పై పడుతుంది.. ప్రతి పది మందిలో ఒకరు కిడ్నీ బాధితులు ఉన్నారు.. రక్తంలో చేరే మలినాలను ప్రమాదకర పదార్థాలను శుద్ధిచేసి బయటకు పంపే శరీర అంగాలలో కిడ్నీ అత్యంత కీలకమైంది.. కిడ్నీ పాడవుతుందని ముందుగానే కొన్ని లక్షణాలు సంకేతాలు ఇస్తాయి.. ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Symptoms of Kidney Failure
Symptoms of Kidney Failure

మూత్రపిండాల పనితీరు మందగిస్తుంటే కొన్ని లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. కిడ్నీల పనితీరు మారుతుంది. కిడ్నీ సమస్యలు రావడానికి అధికరక్తపోటు, డయాబెటిస్ సమస్యలు కీలకం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. వీటిని గుర్తించడంలో ఆలస్యం అవుతుండడం వల్ల ఈలోపే కిడ్నీలు దెబ్బతింటున్నాయి.. బీపీ, షుగర్ ఉన్నవారు ప్రతి మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి చెక్ చేయించుకోవాలి. మూత్రంలో ప్రోటీన్ కనిపిస్తే అప్రమత్తం కావాలి. క్రియాటినిన్ నార్మల్ ఉన్న ప్రోటీన్ ఉంటే కిడ్నీలు దెబ్బతింటున్నాయని అర్థం. అందుకని క్రియాటినిన్ తోపాటు ప్రోటీన్ టెస్ట్ కూడా ఖచ్చితంగా చేయించుకోవాలి. బీపీ, షుగర్, ఎక్కువకాలం ఇన్ఫెక్షన్లతో బాధపడటం వల్ల కిడ్నీ వ్యాధులు ప్రభావితమవుతాయి.

Symptoms of Kidney Failure
Symptoms of Kidney Failure

కిడ్నీలు పాడవుతున్నాయి అంటే ఈ లక్షణాలు కూడా కనిపిస్తాయి.. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. రసాయనాలు, ఇతర హానికర పదార్థాలు, ద్రవాలన్ని ఈ వడపోత ప్రక్రియ ద్వారా బయటకు వెళతాయి. ఏ కారణం చేతైనా కిడ్నీ చేసే ఈ ఫిల్టర్ మెకానిజం ఆగిపోతే.. టాక్సిన్స్, అదనపు ద్రవం అంతా శరీరంలోనే పేరుకుపోతాయి. అదనంగా చేరిన ఈ నీరు ఊపిరితిత్తుల్లోకి చేరి ఆయాసం వస్తుంది. కాళ్ళ వాపు , ముఖం వాపు కనిపిస్తాయి. పొట్టలో నీరు చేరుతుంది. బీపీ పెరిగిపోయి అదుపు తప్పుతుంది. రాత్రిపూట ఎక్కువగా మూత్ర విసర్జనకి వెళ్లాల్సి వస్తుంది. కడుపులో వికారంగా ఉంటుంది. వాంతులు అవుతుంటాయి. ఆకలి మందగిస్తుంది. తరచు జ్వరం వస్తుంది. కీళ్ల నొప్పులు ఎముకలు విరగడం వంటి ప్రమాదాలు జరుగుతాయి. ఎర్రరక్తకణాల ఉత్పత్తికి దోహదపడే లోపం వల్ల రక్తహీనత వస్తుంది. కిడ్నీలు దెబ్బతినడం వల్ల విటమిన్ డి, ఎరిత్రోపాయటిన్ హార్మోన్లు లోపిస్తాయి. నీరసం, అలసటగా ఉంటుంది. శరీరం పాలిపోవటం వంటి సమస్యలు వస్తాయి. మూత్రం సరిగా రాదు.. ఈ లక్షణాలలో ఏవైనా కొన్ని లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించి వెంటనే పరీక్షలు చేయించుకోవాలి..

 

కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు వారు ఇవి పాటించాలి. కిడ్నీ వ్యాధి ఉన్నవారు ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. బీపీ, షుగర్ ఉన్నవారు అదుపులో ఉంచుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. ప్రతిరోజు ఐదు లీటర్ల నీళ్లు తాగాలి. మాంసాహారం కంటే శాకాహారం మేలు.. మాంసాహార ప్రోటీన్ల వల్ల కిడ్నీ పై పై ఎక్కువ భారం పడుతుంది. కాఫీలు, టీలు మితంగా తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం చేయకూడదు..


Share

Related posts

కాకులలో వచ్చిన ఈ కొత్త వైరస్ దేనికి సంకేతం!

Teja

Big Boss: బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా..??

sekhar

వైసీపీ, టిఆర్ఎస్ భేటీ ప్రారంభం

Siva Prasad