బాలీవుడ్ భామ తాప్సీ పన్ను హిందీ, తమిళం, తెలుగు భాషల్లో వివిధ సినిమాలలో కథానాయికగా నటించి అందరి ఆదరణ పొందింది. అయితే ఒక హిందీ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. తాప్సి ఇటీవలే ఓ చిత్రం షూటింగ్ లో భాగంగా జైపూర్ లో షూటింగ్ ముగించుకుని, అక్కడినుంచి హాలిడే స్పాట్ ఎంజాయ్ చేయడానికి, తన సోదరితో కలిసి మాల్దీవులకు వెళ్ళింది .
సముద్ర తీరంలో తన గ్యాంగ్ తో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తున్న తాప్సి ఆ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. తాప్సీ స్విమ్మింగ్ పూల్ లో చేసిన ఓ పని ప్రస్తుతం వైరల్ గా మారింది. తాప్సి స్విమ్మింగ్ పూల్ లో అంత పని ఏం చేసింది అబ్బా అని అనుకుంటున్నారా? ఆ ఫోటో చుసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తాప్సీ స్విమ్మింగ్ పూల్ లో ఏం చేసిందో? తెలుసుకుందాం..
తాప్సి షూటింగ్ లేని సమయంలో ఎలాంటి డైట్ ను ఫాలో కావాలో అన్న విషయాలను గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మున్ ముణ గనేరివాల్ తాప్సిని గైడ్ చేస్తుంటారు. ప్రస్తుతం హాలిడే స్పాట్ ను ఎంజాయ్ చేస్తున్న తాప్సికి ఎక్కువ శాతం ప్రొటీన్లు, కొవ్వు కలిగిన గుడ్లు, అవకాడోస్, పుట్టగొడుగులు వంటి వాటిని తినాలని సూచించారు.
మనల్ని ఎంతో ఇష్టపడే వారు మన జీవితంలో ఉంటే ఎలాంటి వస్తువులైన మన దగ్గరికి వస్తాయనీ అంటారు. నా విషయంలో అలాగే జరిగింది అని క్యాప్షన్ తో #OnADietPlan హ్యాష్ ట్యాగ్ జోడించింది. దీంతో తీరంలోని స్విమ్మింగ్ పూల్ లో ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఈ ఫోటో ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన కొద్దిసేపటికి వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు తాప్సి ఎంతో భిన్నంగా భోజనం చేసిందంటూ ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడైనా సముద్ర తీరంలో, సముద్ర అందాన్ని వీక్షిస్తూ డిన్నర్ చేయడం చూసాం కానీ ఇలా స్విమ్మింగ్ పూల్లో ఫ్లోటింగ్ లంచ్ చేయడం ఎంతో ఆశ్చర్యకరంగా ఉందని ఫోటో చూసిన కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.