Tamilanadu Elections : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి.. తమిళనాడు లో 63. 47 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో (ఎంఎన్ఎం) చీఫ్ కమల హాసన్ కోయంబత్తుర్ సౌత్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా మక్కల్ నీది మయం ( ఎంఎన్ఎం) చీఫ్ కమల హాసన్ కుమార్తె శృతి హాసన్ పై ఎలక్షన్ కమిషన్ కు బీజేపీ ఫిర్యాదు చేసింది..

ఎన్నికల్లో ఓట్లేసిన తరవాత కమల హాసన్ తన కూతుర్లు అక్షర, శృతి హాసన్ తో కలసి నేరుగా కోయంబత్తుర్ సౌత్ నియోజక వర్గం కు వెళ్లారు. ఓటింగ్ సరళిని సమీక్షించడానికి ఆయన నియోజకవర్గం లోని ఓ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఆ సమయంలో కమల హాసన్ తో పాటు శృతి హాసన్ కూడా ఉండటంతో.. నిబంధనలకు విరుద్ధంగా శృతి హాసన్ తన తండ్రితో కలసి కోయంబత్తుర్ సౌత్ లోని పోలింగ్ బూత్ ను అక్రమంగా సందర్శించారని.. క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.. కోయంబత్తుర్ సౌత్ నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాస్ తరపున బీజేపీ జిల్లా అధ్యక్షుడు నందకుమార్ జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాసారు.. పోలింగ్ కేంద్రాల్లోకి బూత్ ఏజెంట్లు తప్ప ఇంకెవ్వరు లోపలి వెళ్లకూడదనే రూల్ ఉందని.. ఆ నిబంధనను అతిక్రమించిందని.. శృతి హాసన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది..