ట్రెండింగ్

Telangana Group 1 Notification: తెలంగాణ గ్రూప్ వన్ ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్..!!

Share

Telangana Group 1 Notification: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విద్య వైద్య రంగానికి సంబంధించి పోస్టులు రిలీజ్ చేయగా నిన్ననే పోలీస్ శాఖకు సంబంధించి.. 16 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 503 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. Telangana Group 1: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసింది.. పూర్తి వివరాలివే.. | Telangana Group 1 Notification Released by TSPSC Know the details | TV9 Telugu

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి గ్రూపు నోటిఫికేషన్ ఇదే కావడం విశేషం. ఇదిలా ఉంటే గ్రూపు వన్ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇంటర్వ్యూ రద్దు చేయటం జరిగింది. అంతమాత్రమే కాదు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష ద్వారా ఉద్యోగాలకు అభ్యర్థులను సెలెక్ట్ చేయనున్నారు. ఈ క్రమంలో అర్హులైన అభ్యర్థులు TSPSC వెబ్సైట్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని TSPSC చైర్మన్ జనార్ధన్ రెడ్డి తెలిపారు.Telangana releases Group 1 notifications for 503 posts

ఈ క్రమంలో మే రెండో తారీకు నుండి మే 31 వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. విడుదలైన నోటిఫికేషన్ లో ప్రిలిమ్స్… పరీక్ష జులై లేదా ఆగస్టులో నెలలో నిర్వహించనున్నట్లు, మెయిన్స్ పరీక్ష నవంబర్ లేదా డిసెంబర్ మాసంలో నిర్వహించడానికి అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో గ్రూప్ వన్ సర్వీసెస్ లో ఫస్ట్ టైం ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ కూడా అమలు చేస్తున్నట్లు కమిషన్ స్పష్టం చేయడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో తెలంగాణ నిరుద్యోగులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

 

ఖాళీలు, పోస్టుల వివరాలు:

డిప్యూటీ కలెక్టర్లు – 42
డీఎస్పీ – 91
సీటీవో – 48
ఎంపీడీవో – 121
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ – 48
రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ – 04
జిల్లా పంచాయత్ ఆఫీసర్ – 05
జిల్లా రిజిస్ట్రార్ – 05
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ – 26
మున్సిపల్ కమీషనర్లు – 41
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు : 40


Share

Related posts

శ్రీముఖి పై నాగబాబు హాట్ కామెంట్స్..! పుసుక్కున నోరు జారేశాడే….?

arun kanna

బిగ్ బాస్ 4: బిగ్ బాస్ వేదికపైకి టాప్ హీరో తో మరికొంతమంది..??

sekhar

Mahesh Akhira: మహేష్ బాబు సాంగ్ కి పవన్ కొడుకు అకీరా మ్యూజిక్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar