ట్రెండింగ్

Omicron Virus: ఓరి నాయనో .. ఒమిక్రాన్ నీకోక దండం .. 10 కోట్ల కరోనా కేసులు !

Share

Omicron Virus: మహమ్మారి కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రన్(Omicron) వల్ల ప్రపంచ దేశాలు గజగజ లాడుతున్నాయి. ఆఫ్రికా(Africa)లో వెలుగులోకి వచ్చిన ఒమిక్రన్ ఇప్పుడు యూరప్(Europe) లో విజృంభిస్తోంది. చైనా(China) నుండి 2019 చివరిలో కరోనా వైరస్(Corona Virus) బయటపడిన నాటినుండి ఎక్కువగా ఈ మహమ్మారి వల్ల యూరప్ దేశాలు అనేక రకాలుగా దెబ్బతినటం జరిగింది. మొదటి నుండి యూరప్ లోనే ఎక్కువగా కేసులు నమోదు కావడంతో పాటు మరణాలు సంభవించాయి. ప్రారంభంలో కరోనా వైరస్ వచ్చిన టైంలో… ప్రపంచ సూపర్ పవర్ కంట్రీ అమెరికా(America) అతలాకుతలం అయిపోయింది. ఆ నాటి ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్(Trump) ఈ మహమ్మారిని అరికట్టడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

COVID-19: Australia records first Omicron death, authorities stick to  reopening plan | Oceania – Gulf News

ఒక్కరోజులోనే లక్షలో  కేసులు నమోదు కావడంతో పాటు వేలల్లో మరణాలు సంభవించడం తో… ఈ వైరస్ వల్ల అమెరికా ప్రపంచ పటంలో నుండి కనుమరుగవుతుందని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత అమెరికా కోలుకొని నిలబడింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒమిక్రన్ సృష్టిస్తున్న విలయ తాండవానికి.. యూరప్ దేశాలలో 10 కోట్ల కంటే ఎక్కువగానే అనధికారికంగా కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో యూరప్ దేశానికి చెందిన వాళ్ళు ఓరి నాయనో .. ఒమిక్రాన్ నీకోక దండం .. అనే పరిస్థితికి వచ్చేశారు. ప్రపంచ లెక్కల ఆధారంగా చూసుకుంటే .. ఒమిక్రాన్ హాట్‌స్పాట్ కేంద్రంగా యూర‌ప్ మారింది.

Germany reports highest daily COVID-19 death toll in nine months |  Coronavirus pandemic News | Al Jazeera

అట్లాంటిక్ తీరం నుంచి ర‌ష్యా వరకు 52 దేశాలు, గ‌త రెండు సంవ‌త్స‌రాల్లో మొత్తం 100,074,753 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. వారం రోజుల్లోనే యూరోపియన్ దేశాల్లో 4.9 మిలియన్లకు పైగా కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో క‌రోనా వెలుగుచూసిన‌ప్ప‌టి నుంచి… యూరప్ లో ఇప్పటిదాకా నమోదైన కేసుల కంటే.. ఇవే కేసులే అత్య‌ధిక‌మ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో యూరప్ దేశాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఒమిక్రన్ సృష్టిస్తున్న విలయతాండవనికి దండం పెట్టేస్తున్నారు. డెల్టా వైరస్ కంటే ఒమిక్రన్ ఆరు రెట్ల వేగంతో.. విజృంభిస్తుండడంతో పాటు కరోనా వాక్సిన్ వేసుకున్న కంట్రోల్ చేయలేనీ పరిస్థితి ఉండటం తో…ప్రపంచ శాస్త్రవేత్తలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది.


Share

Related posts

Ukraine Russia War: ఉక్రెయిన్ పై రష్యా బలగాలు చేస్తున్న దాడులు పట్ల రష్యా ప్రజల రియాక్షన్ ఇదే..!!

sekhar

ట్రంప్ ఎంతబాగా డ్యాన్స్ చేస్తున్నాడో చూడండి!

Teja

Today Gold Rate: దిగొచ్చిన బంగారం వెండి ధరలు.. తాజా అప్డేట్స్ ఇవే..!!

bharani jella