ThankYou Brother: బుల్లితెరపై యాంకర్ గా సత్తా చాటుతూనే వెండితెరపై రాణిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ఏర్పరుచుకుంది అనసూయ భరద్వాజ్.. యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా థ్యాంక్ యు బ్రదర్.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఓ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు అక్కినేని నాగ చైతన్య..
జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రమేష్ రాపర్తి దర్శకత్వంలో థ్యాంక్ యు బ్రదర్ సినిమా రూపొందుతుంది. శరత్ చంద్రారెడ్డి తో కలిసి తారక్ నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ గర్భిణీగా చాలెంజింగ్ రోల్ చేస్తోంది. విరాజ్ అశ్విన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?