ట్రెండింగ్ న్యూస్

Heroine: నిర్మాతగా మారుతున్న మరో టాప్ హీరోయిన్..!!

Share

Heroine: మహమ్మారి కరోనా వచ్చాక చాలా వరకు పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రతి రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో సినిమాల పరంగా కూడా థియేటర్ల కంటే ఓటిటి లకి గిరాకీ పెరిగింది. ఈ క్రమంలో కొంతమంది హీరోయిన్లు నిర్మాతలుగా మారుతూ ప్రొడక్షన్ హౌస్  తమకంటూ సొంతంగా ఉండేలా చూసుకుంటున్నారు. కరోనా వైరస్ రాకముందే టాలీవుడ్ ఇండస్ట్రీలో చార్మి నిర్మాతగా మారడం తెలిసిందే.

Taapsee Pannu slams trolling of women for wearing bikinis, says it 'doesn't happen when men put out half-naked pics' | Bollywood - Hindustan Times

ఆ తరువాత ఇటీవల హీరోయిన్ నమిత తన కంటూ ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్ ఉండేలా చూసుకోవడం జరిగింది. ఇదే దారిలోకి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ  హీరోయిన్ తాప్సీ కూడా చేరిపోయింది. అవుట్ సైడర్ అనే నిర్మాణ సంస్థ స్థాపించింది. కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేసేలా అదే రీతిలో డిఫరెంట్ కంటెంట్ కలిగిన సినిమాలను తెరకెక్కించే రీతిలో.. తాప్సీ రెడీ అయ్యింది. ఒకపక్క హీరోయిన్ గా అనేక సినిమాలు చేస్తూ మరో పక్క నిర్మాతగా తాప్సి మారటంతో బాలీవుడ్ వర్గాల్లో అదేవిధంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఈ వార్త సంచలనంగా మారింది.

Read More: Tollywood: మరో సెన్సేషనల్ లెజెండ్ బయోపిక్ తెరకెక్కించడానికి రెడీ అవుతున్న టాలీవుడ్..??

ఈ నిర్మాణ సంస్థ ద్వారా స్మాల్ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా వెబ్ సిరీస్ తరహాలో కూడా సినిమాలు చేసే ఆలోచనలో తాప్సి ప్లానింగ్ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా ఇదే తరహాలో .. ఒక ద్వీపంలో డిఫరెంట్ గేమ్ షో హాలీవుడ్ తరహాలో ప్లాన్ చేస్తున్నట్లు, దానికి తానే నిర్మాతగా మారె ఆలోచనలో కంగనా ఉన్నట్లు టాక్. మొత్తంమీద చూసుకుంటే కరోనా కారణంగా అవకాశాలు తగ్గిపోతుండటంతో హీరోయిన్లు ఎవరికివారు ప్రొడ్యూసర్లు గా మారుతున్నట్లు.. అర్థమవుతుంది.  


Share

Related posts

BJP Party : ఒక్క ఆలోచన చాలు..! బీజేపీకి గట్టి గండాలే పొంచి ఉన్నాయ్..!? ఈ ఐదూ కీలకం..!!

Srinivas Manem

Prabhas: రాధే శ్యామ్ లో మిస్సైంది ఇవే..అందుకే ఇలాంటి టాక్..!

GRK

Police: పోలీసులు కొన్ని చోట్ల ఖాకీ కి బదులుగా తెలుపు రంగు యూనీఫార్మ్ ఎందుకు ధరిస్తారో తెలుసా?

Naina